కేంద్రీయ విద్యాలయం వద్ద మినీ స్టేడియం నిర్మించాలి: డిప్యూటీ తాహశీల్దార్‌కు టీడీపీ నేతల వినతి.

పలాస :- కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో క్రీడాకారుల సౌకర్యార్థం కేంద్రీయ విద్యాలయం సమీపంలో మినీ స్టేడియం నిర్మించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు మంగళవారం డిప్యూటీ తాసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు.
స్థల మార్పిడిపై విజ్ఞప్తి..

క్రీడాకారులకు మేలు, పాఠశాల పక్కనే క్రీడా మైదానం ఉండటం వల్ల అటు విద్యార్థులకు,యువతకు శారీరక దృఢత్వానికి,క్రీడల్లో రాణించడానికి ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు.పలాస పట్టణంలో సరైన మైదానం లేక క్రీడాకారులు ఇబ్బంది పడుతున్నారని,అధికారులు స్పందించి వెంటనే స్థల మార్పిడిపై నిర్ణయం తీసుకుని పనులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో,టిడిపి నేతలు లోడగల కామేశ్వరరావు,దువ్వాడ శ్రీకాంత్,మల్ల శ్రీనివాస్ బట్ట నాగరాజు మల్లి పెద్ది నరేంద్ర (చిన్ని) తదితరులు పాల్గొన్నారు.

Kancharla Media
Author: Kancharla Media

Leave a Comment