విధులకు వెళ్తూ జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి…

రాంబిల్లి మండలం :- ఎస్.రాయవరం గ్రామానికి చెందిన పిట్ట చిన్న అప్పారావు (30) అచ్చుతాపురం సమీపంలోని బ్రాండిక్స్ 220 కేవీ సబ్‌స్టేషన్‌లో కాంట్రాక్ట్ సబ్‌ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు.ఈయన గత నెల 24న ఉదయం సుమారు 10.40 గంటల సమయంలో తన మోటార్ సైకిల్‌పై విధులకు వెళ్తుండగా,అచ్చుతాపురం బ్రాండిక్స్ సబ్‌స్టేషన్ సమీపంలో రోడ్ డివైడర్‌ను ఢీకొని అదుపు తప్పి కిందపడ్డారు.ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర తల గాయాలు అయ్యాయి.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే సహోద్యోగులకు సమాచారం అందించారు.అనంతరం బ్రాండిక్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని గాయపడిన అప్పారావును అనకాపల్లిలోని ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు.అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నంలోని కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి తరలించారు.అయితే,పది రోజుల పాటు చికిత్స పొందుతూ సోమవారం రాత్రి సుమారు 10.30 గంటల సమయంలో ఆయన మృతి చెందారు.మృతుడి భార్య పిట్ట లిల్లీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.కుటుంబ సభ్యులు,సహోద్యోగులు కన్నీరుమున్నీరుగా విలపించారు…

 

Kancharla Media
Author: Kancharla Media

Leave a Comment