
కురుపాం :- నీలకంఠాపురం పంచాయతీ సంపన్న గూడ గ్రామంలో పీసా అవగాహన పై రెండు రోజుల అవగహన సదస్సు శుక్రవారం ప్రారంభ మైంది.. 1/70 చట్టము గురించి జీవో నెంబర్ 3 మీద ,పిసా చట్టాలపై అవగాహన కు,సంపన్న గూడ లయ సంస్థ ద్వారా జరిగింది.లాయర్ పల్ల త్రినాధ రావు జీవో నెంబర్ 3 , 1/70 చట్టము పై అవగాహన కల్పించారు.పిసా చట్టాలపై ఈ రెండు రోజులు అవగాహన సదస్సులో పీసా అధ్యక్షులు,ఉపాధ్యక్షులు,సెక్రటరీలకు శిక్షణ అందించనున్నారు.మండలంలో అన్ని పంచాయతీలు పీసా కమిటీలు గిరిజన సంఘాలు హాజరయ్యారు.భూమిబదలాయింపు చట్టాలు ఎలాగ ఉన్నాయి,దానిపై పీసా ఉపాధ్యక్షులకు సెక్రటరీలకు అవగాహన కల్పించారు.ముఖ్య అతిథులు లయ సంస్థ డాక్టర్. పల్ల త్రినాధ రావు , టి.. కాంతారావు.మాజీ ఎమ్మెల్యే కోలక లక్షణామూర్తి ,ఆర్ డభ్యు ఎస్ డి.ఇ. కె. నాగేశ్వరరావు,ట్రైబల్ రైట్స్ ఫారం జిల్లా అధ్యక్షులు రామకృష్ణ,లయ సంస్థ సభ్యులు,జయప్రకాష్ ఈశ్వరరావు తదితరులు గిరిజనులు పాల్గొన్నారు…



