
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్…
అమలాపురం :- కక్షిదారులకు సత్వర న్యాయం అందించటమే పరమావధిగా ప్రతిఒక్కరూ పనిచేయాలని హైకోర్టు న్యాయమూర్తి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిపాలనా న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ అన్నారు.అమలాపురంలో 14వ అదనపు జిల్లాసెషన్స్ జడ్జి కోర్టు..
రెండవ అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) – కమ్ -మేజిస్ట్రేట్ కోర్టులను ఆయన ఆదివారం ప్రారంభించారు.అనంతరం బార్ అసోసియేషన్ భవనంలో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు.న్యాయమూర్తులు,న్యాయవాదులు,సిబ్బంది సమన్వయంతో ఆశ్రితులకు న్యాయం అందించటంలో భాగస్వాములు కావాలని కోరారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఈ కృషిలో ముఖ్య భూమిక పోషించాలని కోరారు.కేసుల సంఖ్యకు అనుగుణంగా మౌళిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వాలు చొరవ చూపాలని అన్నారు.కోర్టు భవనాల నిర్మాణం దశాబ్దాల తరబడి కొనసాగటం న్యాయ జాప్యానికి కారణాలుగా నిలుస్తున్నాయని అన్నారు.రాష్ట్ర న్యాయ అభివృద్ధికి తన సహ న్యాయమూర్తులు చేస్తున్న కృషిని శ్లాఘించారు.కోనసీమ నుంచి హైకోర్టు న్యాయమూర్తి గా ఎదిగిన జస్టిస్ సుమతి జగడం దేశంలోనే మొదటి దళిత మహిళా జడ్జి అని ఆయన కొని యాడారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు, జస్టిస్ ఆర్.రఘునందన రావు,జస్టిస్ సుమతి జగడం,జస్టిస్ బి.వి.ఎల్.ఎన్.చక్రవర్తి…
జస్టిస్ న్యాయాధిపతి విజయ్ మాట్లాడారు.వీరిని సభానంతరం అసోసియేషన్ సభ్యులు దుశ్శాలువాలతో సత్కరించి మెమెంటో అందచేసారు.ప్రారంభంలో హైకోర్టు న్యాయమూర్తులు పోలీస్ వందనం స్వీకరించారు.ఈ సమావేశంలో జిల్లా ప్రిన్సిపల్ జడ్జి గంధం సునీత, న్యాయమూర్తులు గంటా ప్రియదర్శిని,గుబ్బల చంద్ర మౌళీశ్వరి,సుంకర శ్రీరేఖ,మహ్మద్రహ్మతుల్లా,పివి.ప్రసాదరావు,జాయింట్ కలెక్టర్ వైకోమ్ నిదియా దేవి,ఎస్పీ రాజులచే మీనా,అసోసియేషన్ అధ్యక్షుడు కాశి శేషారావు ,ప్రధాన కార్యదర్శి నల్లా సురేష్,ఎండి.అజాం,నల్లా ప్రభాకర్,నందిక శ్రీనివాస్ బడుగు భాస్కర్ జోగేష్,డి.బి.లోక్,ఎ.సురేష్,జె.బాబూరావు,ఎ.ప్రసాద్,ఎం.మణి,హమీద్,కె.చంద్రమోహన్,సివి.సురేష్,యు.పి.లక్షమణరావు,వి.సాయి,దేవ,దీవెన,కృష్ణవేణి,ఎం.ఆదినారాయణ,ఎన్.రవిప్రసాద్,పి.బోసు తదితరులు పాల్గొన్నారు…



