
జూన్ 15 నుండి జులై 14 వరకు బిఎల్ఓ లు ఇంటింటి సర్వే…
పార్వతీపురం :- ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా రెవిన్యూ అధికారి కె హేమలత అన్నారు.సోమవారం జిల్లాలోని గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా డిఆర్ఓ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ప్రకటించిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (స్పెషల్ ఇంటెన్షవ్ రెవిషన్ ) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా ఎన్నికల అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు.జులై 1 నుంటి ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఎస్ఐఆర్ అమలుకు సంబంధించి ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్‌ను రాజకీయ పార్టీ ప్రతినిధులకు వివరించారు. సవరణ కార్యక్రమంలో భాగంగా జూన్ 5నుండి 14 వరకు సిబ్బందికి శిక్షణ,ముద్రణ కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.అనంతరం జూన్ 15నుండి జులై 14 వరకు బూత్ లెవల్ అధికారులు ఇంటింటి సర్వే చేపడతారని తెలిపారు.పోలింగ్ స్టేషన్ల పరిశీలన, తనిఖీ జులై 14 నాటికి పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.జులై 21న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించబడుతుందని,అదే తేదీ నుండి ఆగష్టు 20 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్‌ల స్వీకరణ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.వచ్చిన అభ్యంతరాల పరిశీలన,పరిష్కార ప్రక్రియను సెప్టెంబర్ 18 నాటికి పూర్తి చేసి, తుది ఓటరు జాబితాను 22 న ప్రచురించనున్నట్లు వివరించారు.రాజకీయ పార్టీలు ప్రతి పోలింగ్ స్టేషన్‌కు బూత్ లెవల్ ఏజెంట్లను నియమించి, నిర్దేశిత ఫార్మాట్లలో వివరాలు సమర్పించాలని కోరారు.ఇంటింటి సర్వే సమయంలో బి ఎల్ ఓ లకు రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని సూచించారు. అలాగే బి ఎల్ ఓ లు, బి ఎల్ ఏ లు మధ్య సమన్వయం పెంపొందించేందుకు జూన్ 2 న సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. బూత్ లెవల్ ఏజెంట్లకు ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించి’ సార్ ‘ప్రక్రియపై పూర్తి వివరణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అవగాహన కార్యక్రమాలను జూన్ 10 నుండి 13 వ తేదీ మధ్య నిర్వహిస్తామని వెల్లడించారు. ఓటరు జాబితా పారదర్శకంగా, తప్పులేమీ లేకుండా సిద్ధం చేయడంలో రాజకీయ పార్టీల పాత్ర కీలకమని కలెక్టర్ తెలిపారు.18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు కావాలని, రాజకీయ పార్టీలు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని కలెక్టర్ కోరారు.ఈ సమావేశంలో జనసేన పార్టీ ప్రతినిధి పైల. శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ ప్రతినిధి గొట్టాపు.వెంకట నాయుడు,బీజేపీ పార్టీ ప్రతినిధి డి. శ్రీనివాసరావు,వైసీపీ పార్టీ ప్రతినిధి వి.శ్రీనివాసరావు,కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి వంగల. దాలి నాయుడు, సిపిఐ పార్టీ ప్రతినిధి ఆర్ వి ఎస్ కుమార్ ,తదితరులు పాల్గొన్నారు…


