లేబర్ కోడ్స్ రద్దుచేసి కార్మికులకు హక్కులను కాపాడాలి…ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజాన దొరబాబు …

నర్సీపట్నం :- ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తూ తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఎఐటియుసి) ఆధ్వర్యంలో నర్సీపట్నంలో కార్మికులు భారీ ఆందోళన నిర్వహించి లేబర్ కోడ్స్ ప్రతులను దగ్ధం చేశారు.ఈ సందర్భంగా జరిగిన నిరసన కార్యక్రమాని ఉద్దేశించి ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజాన దొరబాబు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా కార్మికుల సాధించిన హక్కులను కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కుతోందని తీవ్రంగా విమర్శించారు.లేబర్ కోడ్స్ అమలుతో పని గంటలు పెరుగుతాయని, ఉద్యోగ భద్రత పూర్తిగా దెబ్బతింటుందని, యజమానులకు కార్మికులను ఎప్పుడైనా తొలగించే అధికారం కల్పిస్తున్నారని అన్నారు. కనీస వేతనాలు, బోనస్‌లు, పీఎఫ్, ఈఎస్ఐ వంటి కార్మిక సంక్షేమ హక్కులు బలహీనపడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ట్రేడ్ యూనియన్ల హక్కులను కూడా కుదించేలా ఈ కోడ్స్ రూపొందించబడినట్లు విమర్శించారు.కార్మిక వ్యతిరేక విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేకపోతే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేపడతామని హెచ్చరించారు. కార్మికులు, ఉద్యోగులు, యువత అందరూ ఐక్యంగా ముందుకు వచ్చి ఈ లేబర్ కోడ్స్‌కు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మద్దతు తెలియజేశారు.ఈ ఆందోళనలో ఎఐటియుసి నాయకులు బాలేపల్లి వెంకటరమణ,చిన్నం నాయుడు,రమణ, సత్యనారాయణ, కొండలరావు, , శ్రీరామమూర్తి,కార్మికులు, వివిధ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు…

Kancharla Media
Author: Kancharla Media

Leave a Comment