గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి రేపటి శ్రీకాకుళం జిల్లా పర్యటనకు సర్వం సిద్ధం చేస్తున్నాం.

నేడు సహచర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు, ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి గారు, జిల్లా కలెక్టర్, ఎస్పీలతో కలిసి నరసన్నపేటలో తామరాపల్లి హెలిప్యాడ్ నుండి సభావేదిక వరకు రూట్ మ్యాప్‌ను స్వయంగా పరిశీలించాను. సత్యవరం కూడలి వద్ద వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్ గ్రేడింగ్ కేంద్రాల ఏర్పాట్లను సమీక్షించాం.ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పర్యటనకు వచ్చే ప్రజలకు, సామాన్య వాహనదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన ప్రత్యామ్నాయ మార్గాలు, పార్కింగ్ సదుపాయాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించాను. వీఐపీల ప్రొటోకాల్, భద్రత విషయంలో రాజీ పడేదే లేదు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి రేపటి సీఎం గారి పర్యటనను నూటికి నూరు పాళ్ళు విజయవంతం చేయాలి…

Kancharla Media
Author: Kancharla Media

Leave a Comment