
కాకినాడ :- ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ సంవత్సరము మే నెల 3వ ఆదివారం అంతర్జాతీయ ఎయిడ్స్ కేండిల్ లైట్ మెమోరియల్ డే–2026 కార్యక్రమమును హెచ్.ఐ.వి.తో మరణించిన వారి జ్ఞాపకార్ధము కొవ్వత్తులతో మౌనర్యాలీ నిర్వహించడం ఆనవాయితీ వస్తున్నాది. ఈ కార్యక్రమం హెచ్.ఐ.వి.తో చనిపోయిన వారికి సంఘీ భావము తెలుపుతూ హెచ్.ఐ.వి.తో జీవిస్తున్న వారికి మానసిక దైర్యాన్నిచ్చేందుకు జరుగుతోంది. రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ వారి ఆదేశాలు అనుసరించి ఆదివారం జిల్లా ఇంటిగ్రేటెడ్ స్ట్రేటేజీ,హెచ్.ఐ.వి.ఎయిడ్స్,.జిల్లా లెప్రసీ,ఎయిడ్స్ అండ్ టి.బి. శాఖకార్యాలయము జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.జె.నరసింహా నాయక్,డా.మేనేజర్,ఎ.బుజ్జిబాబు,క్లినికల్ సర్విస్ ఆఫీసర్,జిల్లా ఇంటిగ్రేటెడ్ స్ట్రటేజీ హెచ్.ఐ.వి.,ఎయిడ్స్ ఆద్వర్యంలో నిర్వహించారు .ఈ సందర్బంగా డా. చలమయ్య మాట్లాడుతూ హెచ్.ఐ.వి.తో జీవిస్తున్న వారు హెచ్.ఐ.వి.తోనే కాకుండా వారిలోని రోగ నిరోధక శక్తి తాగే అవకాశ వ్యాధులు రావటం వలన ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి అని తెలిపినారు కనుక మంచి పౌష్టికాహారం తీసుకుంటూ చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని కోరారు. హెచ్.ఐ.వి.తో జీవిస్తున్న వ్యాధిగ్రస్తులు ఎ.ఆర్.టి. మందులు క్రమము తప్పకుండా వాడటమే కాకుండా మానసిక ధైర్యాన్ని కలిగి ఉండాలని తద్వారా వారు వారియొక్క జీవిత ప్రమాణం పెరుగుతుందని చెప్పారు.
అనంతరము జిల్లా వైద్య ఆరోగ్య శాఖకార్యాలయము లో భీమభాయి మహిళా మండలి వారితో హెచ్.ఐ.వి.తో జీవిస్తున్న 50 మందికి పౌష్టికాహారం పంపిణీ చేయడం జరిగినది.అలాగే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయము నుండి ఈట్ స్ట్రీట్,తెలుగు తల్లి విగ్రహము సెంటర్ వరకు ర్యాలీగా వచ్చి మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేయడం జరిగినది.ఈ కార్యాక్రమము నకు 300 మంది ఈ ర్యాలిలో పాల్గొన్నారు.ఈ కొవ్వత్తుల మౌనర్యాలీలో జిల్లాలోని అధికారులు,ఎ.ఆర్.టి. మెడికల్ ఆఫీసర్లు, సిబ్బంది, జిల్లా నెట్వర్క్ ఆఫ్ పాజిటివ్ పీపుల్, నర్సింగ్ విద్యార్థునులు,ఐ.సి.టి.సి అండ్ డి.ఎస్.ఆర్.సి.,స్వచ్చంద సంస్ద ప్రతినిధులు (భీమభాయి మహిళా మండలి, కె.టి.సి. విధ్యా సంస్ధ), టార్గట్ ఇంర్వేష్ న్ నుండి చేంజెస్ (ఎఫ్.ఎస్.డబ్ల్యు),ఉమా మనోవికాస కేంద్రము (మైగ్రేషన్),లింక్ వర్కర్స్,జిల్లా వైద్య ఆరోగ్య శాఖా సిబ్బంది,టి.బి.సిబ్బంది,జిల్లా ఇంటిగ్రేటెడ్ స్ట్రటేజీ హెచ్.ఐ.వి. ఎయిడ్స్ సిబ్బంది, సిబ్బంది పాల్గొన్నారు…



