
ఏలేశ్వరం :- ఏలేశ్వరం ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ డిపో కార్యదర్శి యుబిఎన్ కుమార్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విరామ సమయంలో ఎలక్ట్రికల్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేటు వారికి దారాదత్తం చేయడంపై ఆదివారం ధర్నా, నిరసన కార్యక్రమాలు చేపట్టారు.ఈ సందర్భంగా యు.బి. ఎన్. కుమార్ మాట్లాడుతూ ఎలక్ట్రికల్ బస్సులు ఆర్టీసీ సిబ్బందితోనే నడపాలని, బస్సుల సంఖ్య పెరిగితే గాని స్త్రీశక్తి పథకం విజయవంతం కాదని,పదివేల బస్సులు కొనుగోలు చేయాలని,2000 మంది సిబ్బందిని రిక్రూట్ చేయలన్నారు. అలాగే పాత పద్ధతి లోనే రిఫెరల్ వైద్య విధానం ఉండాలని, పెండింగ్ బకాయిలు చెల్లించాలని, పి అర్ సి కమిషన్ వేయాలని,కొత్త డిఏ,ఐఆర్ ప్రకటించాలని, మెకానికులకి 12 సంవత్సరాలు ఇంక్రిమెంట్లో ఇబ్బందులను తొలగించాలని,ఎలక్ట్రికల్ బస్సుల పేరుతో డిపోలను ఖాళీ చేయించే విధానం మానుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎంఆర్ కృష్ణ,ఎల్ వి ఎస్ నారాయణ,బివివి ప్రసాద్, వీనం లోవరాజు, జి ఎస్ నారాయణ,గ్యారేజీ ప్రసాద్, వివి ప్రసాద్, బిఆర్ఎల్ రావు, నల్ల శ్రీను, పద్మావతి,విజయ,అప్పలరాజు,డీకే రాజు,కుమారి తదితరులు పాల్గొన్నారు…



