ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలి..జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్…

11 ఎంఎస్ఎంఈ యూనిట్లకు రూ. 71.86 లక్షల విలువైన రాయితీ ప్రయోజనాల జారీకి కమిటీ ఆమోదం.జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పారదర్శకంగా…త్వరితగతిన అనుమతులు మంజూరుకు చర్యలు..

కాకినాడ :-జిల్లాలో వివిధ నియోజకవర్గ స్థాయిలో చేపట్టిన ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణ పనులు వేగవంతం చేసి నిర్దేశించిన గడువులోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు.శుక్రవారం కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా పరిశ్రమలు,ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ(డీఐఈపీసీ) సమావేశం జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఏక గవక్ష విధానం క్రింద గడచిన త్రైమాస కాలంలో అందిన ధరఖాస్తుల పరిష్కారం,చిన్న,మద్య తరహా పరిశ్రమల ప్రోత్సాహనికి వివిధ రాయితీల మంజూరు,ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ల నిర్మాణ పురోగతి వంటి అంశాలపై జిల్లా కలెక్టర్..పరిశ్రమలు,ఫ్యాక్టరీస్,పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్,గ్రౌండ్ వాటర్,అగ్నిమాపక,ఏపీఐఐసీ,ట్రాన్స్పోర్ట్ తదితర శాఖల అధికారులతో చర్చించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గత త్రైమాస కాలంలో వివిధ పరిశ్రమల స్థాపనకు అనుమతులు కోరుతూ మొత్తం 175 దరఖాస్తులు అందగా,సింగిల్ డెస్క్ విధానంలో ఆయా శాఖల ద్వారా 151 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయడం జరిగిందన్నారు. మిగిలిన 24 దరఖాస్తులు వివిధ శాఖల వద్థ పరిశీలనలో ఉన్నాయని జిల్లా కలెక్టర్ తెలిపారు.పరిశీలనలో ఉన్న దరఖాస్తులు అన్నిటిపైన నిర్థిష్ట గడువు లోపు తగిన పరిష్కారం అందించాలని జిల్లా కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు.జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు నుంచి అందిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.చిన్న,మద్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) ప్రోత్సాహం కొరకు పెట్టుబడి రాయితీ, పావలవడ్డీ,విద్యుత్, తదితర రాయితీల క్రింద జిల్లాలో ఉత్పాదన,సేవా రంగాల్లోని 11 యూనిట్లకు సుమారుగా రూ.71,86,191 విలువైన రాయితీ ప్రయోజనాల జారీకి కమిటీ ఆమోదించిందన్నారు.జిల్లాలో నియోజక వర్గానికి ఒకటి చొప్పున ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.ఈ నిర్మాణ పనులపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి,నిర్దేశించిన గడువులోపు నిర్మాణాలకు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ) కింద రుణాల మంజూరుకు 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం జిల్లా లక్ష్యం,విధి విధానాలు ఖరారు చేయాల్సి ఉందని జిల్లా కలెక్టర్ తెలిపారు.ఈసమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ జీఎం సీహెచ్.గణపతి ఏడీ ఎస్.విజయ్ కుమార్,ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ ఎ.రమణా రెడ్డి,గ్రౌండ్ వాటర్ డీడీ రాధాకృష్ణ,జిల్లా అగ్నిమాపక అధికారి సీహెచ్. కృపావరం,డీటీసీ ఎన్.శ్రీధర్,లీడ్ బ్యాంక్ మేనేజర్ సీహెచ్ఎస్వి ప్రసాద్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇతర శాఖల జిల్లా అధికారులు, పరిశ్రమల శాఖ సిబ్బంది మరియు వివిధ అసోసియేషన్స్ ప్రతినిధులు పాల్గొన్నారు…

Kancharla Media
Author: Kancharla Media

Leave a Comment