టీసీఎస్ లో సిస్టమ్స్ ఇంజనీర్ గా నన్నయ విద్యార్థి…వీసీ ప్రసన్నశ్రీ అభినందనలు..

రాజమహేంద్రవరం :- ఆదికవి నన్నయ విశ్వ విద్యాలయంలో 2026 సంవత్సరంలో ఎంసీఏ కోర్సు పూర్తి చేసిన విద్యార్థి టీ సత్య సాయి ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లో “సిస్టమ్స్ ఇంజనీర్” హోదాకు ఎంపిక కావడం విశ్వ విద్యాలయానికి గర్వకారణమని వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ అభినందనలు తెలిపారు.టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సంస్థ నిర్వహించిన నియామక ప్రక్రియలో ప్రతిభ కనబరిచిన సత్య సాయికి వార్షికంగా రూ.7.39 లక్షల వేతనంతో ఉద్యోగం లభించిందని అన్నారు.సత్యసాయి సాధించిన ఈ విజయం ప్రభుత్వ విశ్వ విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తుంది అన్నారు.విద్యార్థులు కృషి, నైపుణ్యం,పట్టుదలతో ముందుకు సాగితే జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత అవకాశాలు సాధించగలరన్నారు.విశ్వ విద్యాలయం విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉపాధి అవకాశాల కల్పనలో నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.ప్లేస్‌మెంట్ ఆఫీసర్ ఆచార్య బీ జగన్ మోహన్ రెడ్డి విద్యార్థి సత్య సాయిని అభినందిస్తూ అతని క్రమశిక్షణ,సాంకేతిక నైపుణ్యం,ఆత్మవిశ్వాసం ఈ విజయానికి కారణమని అన్నారు.అలాగే విద్యార్థుల ప్రతిభను గుర్తించి అవకాశాలు కల్పిస్తున్న టీసీఎస్ సంస్థకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.విశ్వ విద్యాలయ అధ్యాపకులు, సహ విద్యార్థులు, కుటుంబ సభ్యులు సత్య సాయికి అభినందనలు తెలియజేస్తూ,భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Kancharla Media
Author: Kancharla Media

Leave a Comment