గుంటూరులో టీడీపీ జోనల్ సమన్వయ సమావేశం…

బి.టి.నాయుడును మర్యాదపూర్వకంగా కలిసిన పల్నాడు జిల్లా నేతలు…

నరసరావుపేట :- తెలుగుదేశం పార్టీ సంస్థాగత బలోపేతంలో భాగంగా సోమవారం గుంటూరులో జోనల్ సమన్వయ సమావేశం నిర్వహించారు. జోనల్ కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ బెందుల తిరుమల నాయుడు (బి.టి. నాయుడు), టిడిపి పల్నాడు జిల్లా అధ్యక్షుడు జాన్ సైదా, నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు,నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, పెదకూరపాడు సత్తనపల్లి పిడుగురాళ్ల ఎమ్మెల్యేలు భాష్యం ప్రవీణ్, కన్నా లక్ష్మీనారాయణ, యరపతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. బాపట్ల, నరసరావుపేట పార్లమెంటరీ జిల్లాల బాధ్యులుగా ఉన్న ఎమ్మెల్సీ బెందుల తిరుమల నాయుడు సమావేశం అనంతరం నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. డిజిటల్ మహానాడు ఏర్పాట్లు గురించి, నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితి, క్షేత్రస్థాయి కేడర్ క్రియాశీలత,బూత్ కమిటీల బలోపేతం,ప్రజా సమస్యలపై పార్టీ కార్యాచరణ వంటి అంశాలపై నేతల నుంచి వివరాలు తెలుసుకున్నారు. టీడీపీ అధిష్టానం 2026 ఏప్రిల్ 15న ఎమ్మెల్సీ బెందుల తిరుమల నాయుడును జోనల్ కోఆర్డినేటర్‌గా నియమించింది. 2026 ఏప్రిల్ 29న మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు,నారా లోకేష్ సమక్షంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. 2026 మే 12న పార్టీ ఆదేశాల మేరకు బాపట్ల,నరసరావుపేట పార్లమెంటరీ జిల్లాల బాధ్యతలను ఆయనకు అప్పగించారు. అప్పటి నుంచి గుంటూరు జిల్లా పరిధిలో పార్టీ వ్యవహారాలపై,ముఖ్యంగా తన పరిధిలోని రెండు పార్లమెంటరీ జిల్లాల్లో నాయకులు,కార్యకర్తలతో సమన్వయ సమావేశాలు నిర్వహిస్తూ బి.టి.నాయుడు చురుగ్గా వ్యవహరిస్తున్నారు.

Kancharla Media
Author: Kancharla Media

Leave a Comment