
భారీ బహిరంగ సభలు వద్దు అన్న ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి పిలుపును గౌరవించాలి..
మంత్రులు,ఎమ్మెల్యేలు పార్టీ చిహ్నమైన సైకిల్ పై ప్రయాణించాలి…
నారా లోకేష్ కు తెలుగు శక్తి అధ్యక్షులు బి.వి.రామ్ సూచన…
పెందుర్తి : ప్రజలు గుమిగూడే సభలను తగ్గించాలని ప్రధాని మోదీ పిలుపును గౌరవించి తెలుగు దేశం పార్టీ నెల్లూరు జిల్లాలో జరుపతలపెట్టిన మహానాడును రద్దు చేయాలని, ఆన్లైన్ ద్వారా మహానాడును జరుపుకోవాలని శుక్రవారం ఉదయం పెందుర్తిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగు శక్తి అధ్యక్షులు బి.వి.రామ్ ఆ పార్టీ కి విజ్ఞప్తి చేశారు. ప్రధాన మంత్రి పిలుపును టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేష్ గౌరవించి మహానాడును లక్షలాదిమందితో కాకుండా ఆన్లైన్ ద్వారా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. మహానాడు ను లక్షలాదిమంది తో నిర్వహిస్తే దానికి తరలివచ్చే కార్యకర్తలు, వేలాది వాహనాల వల్ల భారీగా పెట్రోల్, డీజిల్ వినియోగం జరుగుతుందని తెలిపారు. సభల పరిమాణం తగ్గించి ఇంధన పొదుపు చేయాలని కోరారు.కాన్వాయ్ లో వాహనాలు తగ్గించుకునే పరిణామం లో ఇంధన వినియోగం తగ్గించాలన్నారు.తెలుగు దేశం పార్టీ చిహ్నమైన సైకిల్ పై ఎమ్మెల్యే, మంత్రులు ప్రయాణించి ప్రజలకు ఆదర్శంగా నిలవాలి అన్నారు.వీలైనంత మేరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను వినియోగించాలని కోరారు.
సమీకరణాలు/సమ్మేళనాలు వద్దు అని ప్రధాన మంత్రి చెప్పారన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు రాకుండా వర్కు ఫ్రం హోం నిర్వహించాలని,అదేవిధంగా సోమవారం మెట్రో లో ఆఫీసులకు రావాలని ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం సూచించిందని తెలిపారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సన్నిహితులైన మంత్రి నారా లోకేష్ ఆయన పై గౌరవం ఉంటే మహానాడు నెల్లూరులో నిర్వహించకుండా ఆన్లైన్ ద్వారా నిర్వహించాలని కోరారు.ప్రధాన మంత్రి తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇస్తున్నట్టుగా రాష్ట్ర ప్రజలకు కూడా సందేశం ఇచ్చినట్లు అవుతుంది అన్నారు. దేశం ఇంధన కొరత ఎదుర్కొంటున్న, ఈ తరుణంలో బల నిరూపణ అవసరమా అని ప్రశ్నించారు?.ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై గౌరవం ఉంటే మహానాడు రద్దు చేస్తున్నట్లు వెంటనే ప్రకటించాలని, నెల్లూరులో జరుగుతున్న ఏర్పాట్లను నిలిపేయాలని డిమాండ్ చేశారు. సైకిల్ వినియోగం పెరిగే విధంగా ప్రజా ప్రతినిధులు చర్యలు తీసుకోవాలని అన్నారు.విలేఖలు సమావేశంలో డాక్టర్ పప్పూర్ నికుంజ్,పీతల అప్పారావు తదితరులు పాల్గొన్నారు…



