
అనకాపల్లి రూరల్ :- గ్రామీణ ప్రాంతాలలో వెనుకబడిన క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని కే ఎన్ వి సత్యనారాయణ (పైసా మాస్టారు) అన్నారు.ఆంధ్ర ప్రదేశ్ క్రీడా ప్రాధికారిక సంస్థ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా క్రీడా ప్రాధికారిక సంస్థ నేతృత్వంలో వేసవి ఉచిత క్రీడా శిక్షణ శిబిరాలు అనకాపల్లి కె ఎస్ ఆర్ (పైసా మాస్టర్) స్పోర్ట్స్ అకాడమీ కాండ్రేగుల నాయుడు లేఅవుట్ లో సింహం బొమ్మ పక్కన శిక్షణ శిబిరంలో పాల్గొన్న క్రీడాకారులకు టీ షర్ట్లు గల్లా గణేష్ మాస్టర్ అందించారు, అలాగే రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ అందించిన చెక్కిలు క్రీడాకారులకు కే ఎన్ వి సత్యనారాయణ( పైసా మాస్టర్) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర టెన్నికోయిట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జాతీయ టెన్ని కోయిట్ సమైక్య టెక్నికల్ కమిటీ చైర్మన్ అందించారు ఈ క్రీడా కార్యక్రమాలను అకాడమీ ఇంచార్జ్ డాక్టర్ కొణతాల రాజేష్ పాల్గొన్నారు. ఈ క్రీడా శిక్షణ శిబిరం జూన్ నెల వరకు కూడా నిర్వహించడం జరుగుతుంది అవకాశం ఉన్న క్రీడాకారులు ఉచిత క్రీడా శిక్షణ శిబిరాన్ని వినియోగించుకోవాలని, క్రీడాకారుల శారీరక దృఢత్వం కొరకు వ్యాయామం చేయించడం, క్రీడాకారులకు నచ్చిన క్రీడలో ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ఉచితంగానే నిర్వహిస్తున్నామన్నారు. డాక్టర్ కొణతాల రాజేష్ తెలియజేశారు ప్రతిరోజు కూడా క్రీడాకారులకు డైట్ కూడా ఉచితంగా అందించడం జరుగుతుందని,ఈ సదవకాశాన్నివినియోగించుకోవాల్సిందిగా కోరారు. శిక్షణ పూర్తి అయిన తర్వాత క్రీడాకారులకు క్రీడా ధ్రువ పత్రం అందించడం జరుగుతుందని,ఈ శిక్షణ శిబిరంలో ప్రతిరోజు ఉచితంగా ఇండియన్ గేమ్స్ కొరకు శారీరక దృఢత్వం(ఫిట్నెస్) చేయించడం జరుగుతుందని తెలియజేశారు…



