సేవా కార్యక్రమాలు కొనసాగిస్తాం :మాజీ ఎంపీ భరత్ …

భరత్ చేస్తున్న కార్యక్రమం శుభ పరిణామం :పిల్లి సుభాష్ చంద్రబోస్,జాబ్ మేళాతో వేలాది మందికి ఉద్యోగాలు,మెగా మెడికల్ క్యాంపుతో పేదలకు వైద్య సేవలు : మార్గాని నాగేశ్వరరావు,భరత్ రామ్ ఫౌండేషన్ మెగా మెడికల్ క్యాంపులో ఉచిత వైద్య పరీక్షలు,ఉచితంగా మందుల పంపిణీ..
కాంటినెంటల్,జిఎస్ఎల్,వాసన్ ఐ కేర్,మాగ్న,జాబిల్లి,రమాదేవి డెంటల్,ప్లస్ హాస్పిటల్స్ నిపుణుల సేవలు …

రాజమహేంద్రవరం :- మాతృ దినోత్సవం సందర్భంగా మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించినట్టు మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ తెలిపారు.తమ మార్గాని భరత్ ఫౌండేషన్ ద్వారా నిరంతరం సేవా కార్యక్రమాలు అందించాలని నిర్ణయించామని చెప్పారు.ఆదివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి,రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆధ్వర్యంలో స్థానిక కృష్ణ నగర్ కొత్తరోడ్డులోని వీవీ గార్డెన్స్‌లో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు.ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు కూడా పంపిణీ చేసారు.కాంటినెంటల్ హాస్పిటల్స్ ,జీఎస్ఎల్ హాస్పిటల్స్, మాగ్న హాస్పిటల్,వాసన్ ఐ కేర్ హాస్పిటల్స్ ,జాబిల్లి హాస్పిటల్,రమాదేవి డెంటల్,ప్లస్ హాస్పిటల్స్ వైద్య నిపుణులు ఉచిత వైద్య శిబిరానికి హాజరై వైద్య సేవలు అందించారు.రత్నం మెడికల్స్,రామలక్ష్మి మెడికల్ ఏజన్సీ నిర్వాహకులు మందులు అందజేశారు.ఆదిత్య కాలేజీ ఎన్ ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ జీవీఎస్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వాలంటీర్లు సేవలందించారు.భరత్ తో పాటు రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు కూడా వైద్య పరీక్షలు చేయించుకున్నారు.ఈ సందర్బంగా బోస్ మాట్లాడుతూ వివిధ హాస్పిటల్స్ నుంచి వైద్య నిపుణులను రప్పించి పేద ప్రజలకు వైద్య సేవలు అందించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.మాజీ ఎంపీ భరత్ ఇంత చక్కటి కార్యక్రమాన్ని మాతృ దినోత్సవం సందర్భంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు.ప్రభుత్వ పరంగా ఆరోగ్యశ్రీ 80 శాతం మేరకు వైద్య సేవలు అందకుండా నమ్మకం కోల్పోయిన దశలో ఇలాంటి క్యాంపులు పెట్టి ఉచితంగా వైద్య పరీక్షలు జరిపించి మందులు కూడా ఉచితంగా అందించడం మంచి పరిణామమన్నారు.మాజీ ఎంపీ భరత్ రామ్ మాట్లాడుతూ మదర్స్ హైదరాబాద్ కాంటినెంటల్ హాస్పిటల్, రాజమండ్రి జీఎస్ఎల్,వాసన్ ఐ కేర్, మాగ్న వంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నుంచి నిపుణులైన వైద్యులు విచ్చేసి ఈ శిబిరంలో ఉచితంగా వైద్య పరీక్షలు అందించారని, అలాగే ఉచితంగా మందులు అందించామని తెలిపారు.రాజమండ్రి ప్రజల కోసం నిర్వహించిన ఈ మెగా వైద్య శిబిరానికి మంచి స్పందన లభించిందని అన్నారు.మార్గాని భరత్ ఫౌండేషన్ ద్వారా నిరంతరం సేవా కార్యక్రమాలు అందించాలని నిర్ణయించామని చెప్పారు. గతంలో మెగా జాబ్ మేళా పెట్టి, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించామని భరత్ గుర్తుచేశారు.ఇప్పుడు మెగా మెడికల్ క్యాంపు నిర్వహణ ద్వారా క్యాన్సర్,హార్ట్,కిడ్నీస్,ఊపిరితిత్తులు,కీళ్ల నొప్పులు,న్యూరో,డెంటల్,కంటి,గైనకాలజి తదితర అన్ని విభాగాలకు సంబంధించిన వైద్య పరీక్షలు ఇక్కడ నిర్వహించి ఉచితంగా మందులు అందజేస్తున్నట్లు తెలిపారు.తన తండ్రి మార్గాని నాగేశ్వరరావు మంచి సహకారం అందించి ప్రోత్సహిస్తున్నారని ఆయన తెలిపారు.భవిష్యత్తులో కూడా ఇలాంటి శిబిరాలు నిర్వహించనున్నట్లు భరత్ తెలిపారు. మార్గాని నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజాసేవలో ఉన్నపుడు సేవా కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని చాటి చెబుతూ మార్గాని భరత్ ఫౌండేషన్ తరపున సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు.గతంలో జాబ్ మేళాల నిర్వహణ ద్వారా రెండువేలమంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించారని తెలిపారు. ఇప్పుడు వివిధ విభాగాల వైద్య నిపుణులతో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించి ఉచిత వైద్య పరీక్షలు, ఉచితంగా మందుల పంపిణీ చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.ఈ నెల 12న భరత్ పుట్టిన రోజు సందర్బంగా ముందస్తుగా ఈ శిబిరం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, తలారి వెంకట రావు, వైఎస్ఆర్సీపీ రామచంద్రపురం కోఆర్డినేటర్ సూర్య ప్రకాష్,వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసంశెట్టి గంగాధరరావు,రాజమండ్రి సిటీ వైస్సార్సీపీ అబ్జర్వర్ అద్దంకి ముక్తేశ్వర రావు, మాజీ కోఆర్డినేటర్ గిరజాల బాబు,కడియం వైసీపీ అధ్యక్షుడు స్టాలిన్,వైఎస్ఆర్సీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు…

Kancharla Media
Author: Kancharla Media

Leave a Comment