
కాకినాడ :- నిస్వార్ధమైన ప్రేమను అందించేది అమ్మ మాత్రమేనని పిల్లల ఉన్నతి కోసం నిరంతరం తపించే త్యాగమూర్తి అమ్మ అని విశ్రాంతి ఉపాధ్యాయులు నిమ్మకాయల వెంకటేశ్వరరావు ఆదివారం అన్నారు .కాకినాడ లోని రమణయ్యపేట లో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృ దినోత్సవం పురస్కరించుకుని ఆదివారం పలువురు మాతృమూర్తులను అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లి ప్రేమ నిస్వార్ధమైందని జీవితంలోని ప్రతి సవాల్ లను ఎదుర్కొనే శక్తిని అమ్మ మనకునేర్పిస్తుందన్నారు.అమ్మ ప్రేమ,త్యాగం,కుటుంబాన్ని పోషించడంలో ఆమె సాగించే పాత్రను గుర్తించి కృతజ్ఞతలు తెలుపుకొనే రోజు ప్రపంచ మాతృ మూర్తి దినోత్సవం అని నిమ్మకాయల వెంకటేశ్వరరావు తెలిపారు.ఈ సందర్భంగా అడబాల రత్న ప్రసాద్ సమకూర్చిన నూతన వస్త్రాలను కూతుళ్లు తల్లులకు అందించారు.ఈ కార్యక్రమంలో ప్రసాద్ నాయుడు,రాజా,పి.ధర్మచంద్ర రాజు తదితరులు పాల్గొన్నారు…



