

గజపతినగరం, శక్తి యాప్ మహిళలకు రక్షణ కవచం వంటిదని, శనివారం గజపతినగరంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ సన్యాసినాయుడు అన్నారు. గజపతినగరం వెలుగు కార్యాలయంలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారిణి ఎం రాజేశ్వరి ఆధ్వర్యంలో మహిళలకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ సన్యాసినాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా సాధికారత కార్యక్రమంలో భాగంగా మహిళల హక్కులు, శక్తి యాప్ వినియోగం, శక్తి వాట్సాప్ నెంబర్, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తదితర విషయాల గురించి అవగాహన కల్పించారు. మహిళల భద్రతకు తీసుకోవలసిన జాగ్రత్తలను తెలియజేశారు. కార్యక్రమంలో గజపతినగరం ఎస్ఐ కే కిరణ్ కుమార్ నాయుడు, తదితరులు పాల్గొన్నారు




