హైద‌రాబాద్‌ను వ‌ద‌ల‌ని ఉగ్రవాద ఛాయ‌లు…?

పాకిస్తాన్ ఉగ్రవాదులతో లింక్.
ఛాన్స్ ఇస్తే నేను పాక్ కు వస్తాను..
ఆన్ లైన్ లో ఓ యువకుడు చాటింగ్..
మేడ్చల్ లో వ్య‌క్తి అరెస్టు..

హైద‌రాబాద్‌ :- హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రానికి శివారులో ఉన్న మేడ్చెల్‌లోని ఒక హోటల్‌లో వెయిట‌ర్‌ ముసుగులో నిరంతరం పాకిస్తాన్ ఉగ్రవాదులతో టచ్ లో ఉంటూ.. మన దేశంలోని కొంత మంది ప్రముఖుల వివరాలను చేరవేస్తున్న వ్యక్తిని మేడ్చల్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన జాహేద్ ఫిబ్రవరి నెలలో హైదరాబాద్ మేడ్చల్ ప్రాంతానికి వలస వచ్చాడు. మేడ్చెల్ లోని ముబారక్ హోటల్ లో వేటర్ పనిలోకి చేరి ఇక్కడే నివాసం ఉంటున్నాడు.జాహేద్ తన ఇన్ స్టాగ్రాం ద్వారా పాకిస్తాన్ లోని ఉగ్ర వాదులతో నిరంతరం టచ్ లో ఉన్నాడు. వారితో తాను పాకిస్తాన్ వస్తానని, ఉగ్రవాద శిక్షణలో పాల్గొంటానని పలుమార్లు కోరాడు.ఈ నేపధ్యంలో అక్కడి పాకిస్తాన్ ఉగ్రవాదులు జాహేద్ కు కొన్ని పరీక్షలను కూడా పెట్టారు. నీవు మేము చెప్పిన వారి సమాచారం ఇస్తే నీకు పాకిస్తాన్ రావడానికి అవకాశం ఇస్తామని చెప్పడంతో జాహేద్ కొంత మంది విఐపిల సమాచారంతో పాటు భద్రతకు సంబంధించిన కొన్ని విషయాలను వారికి షేర్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.అంతేకాకండా జాహేద్ ఉగ్రవాదానికి సంబంధించిన విడియోలను చూడడం తో పాటు తుపాకులతో ఫోటోలు దిగుతు వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తు ఉగ్రవాదం పై ఆకర్షితులైనట్లు పోలీసులు విచారణలో తెలుసుకున్నారు.జాహేద్ నుంచి ఒక మొబైల్ ఫోన్ తో పాటు, రెండు బొమ్మ తొపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.పోలీసులతో పాటు ఇంటలిజెన్స్,కౌంటర్ ఇంటలిజెన్స్ అధికారులు అప్రమత్తమై జాహేద్ కు సంబంధించిన అంశాలను లోతుగా విచారిస్తున్నారు.జాహేద్ సోషల్ మీడియాలో షేర్ చేసిన సమాచారంతో పాటు డిలీట్ అయిన ఇన్ ఫర్మేషన్ గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.

జాహేద్ పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదితో మాట్లాడిన విషయం పై కూడా పోలీసులు విచారణ జరపడంతో ఆ వ్యక్తి ప్రస్తుతం పాక్ లో టెర్రరిస్టు కార్యక్రమాలను నిర్వహించడంలో యాక్టివ్ గా ఉన్నట్లు తెలిసింది. జాహేద్ ను అరెస్టు చేసిన మేడ్చల్ పోలీసులు మరోసారి అతనిని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించనున్నారు…

Kancharla Media
Author: Kancharla Media

Leave a Comment