దివ్యాంగుల ఐక్యతతోనే సమస్యల పరిష్కారం…

పలాస :- దివ్యాంగులు ఐకమత్యంతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని విభిన్న ప్రతిభావంతుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షుడు ఆవుల వేణుగోపాల్ అన్నారు. మందస మండల కేంద్రంలో దివ్యాంగుల సమస్యలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనతోపాటు జిల్లా ప్రధాన కార్యదర్శి కోకల మోహన్ రావు లు మాట్లాడుతూ దివ్యాంగులకు యు డి ఐ డి సర్టిఫికెట్ల జారీ సమయంలో కలుగుతున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించి వికలాంగులను ఆదుకోవాలని కోరారు. వివాహంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క దివ్యాంగులకు ఇల్లు పట్టాలు మంజూరు చేయాలని అంత్యోదయ కార్డు మంజూరు చేయాలని అన్నారు.దివ్యాంగుల సర్టిఫికెట్లు రీవెరిఫికేషన్ వల్ల సదరం సర్టిఫికెట్లు దివ్యాంగులకు అందడం లేదని అన్నారు. దివ్యాంగుల సమస్యలు పై వారి నుంచి వినతని సేకరించారు. దివ్యాంగుల నూతన కార్యవర్గం: గౌరవ అధ్యక్షులు ముంజేటి దేవదాసు అధ్యక్షుడు అందాల అవేష్ ఉపాధ్యక్షుడు జుత్తు హైమావతి ప్రధాన కార్యదర్శి శిష్టు ఝాన్సీ కార్యవర్గ సభ్యులు పి పాపారావు మామిడి జానకరావు సభ్యులుగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు కొందరు దృష్టి పాత్ర బ్రాహ్మణ కుల సంఘ అధ్యక్షుడు సింహాచల మహంతి బిజెపి టౌన్ అధ్యక్షుడు హడ్డి గౌడ్ దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు…

Kancharla Media
Author: Kancharla Media

Leave a Comment