అన్నవరం సత్యదేవుని సన్నిధిలో ఘనంగా ప్రాకార సేవ…

అన్నవరం :- కాకినాడ జిల్లా అన్నవరం ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధానంలో శనివారం పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రాకార సేవ అత్యంత వైభవంగా జరిగింది.ముందుగా అర్చక స్వాములు సత్యదేవుడు మరియు అనంతలక్ష్మి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను వివిధ రకాల సుగంధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం స్వామి,అమ్మవార్లను తిరుచ్చి వాహనంపై ఆసీనులను గావించి,మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో ఊరేగించారు.

​వేద పండితుల మంత్రోచ్ఛరణలు,భక్తుల నామస్మరణలతో రత్నగిరి క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది.ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తరించారు. ఈ ప్రాకార సేవలో ఆలయ ఏఈఓ దామోర కృష్ణారావు,ఆలయ ప్రధాన అర్చకులు, వేద పండితులు,దేవస్థానం సిబ్బంది మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు…

Kancharla Media
Author: Kancharla Media

Leave a Comment