
రైల్వే కోడూరు :- తెలుగుదేశం పార్టీ రైల్వే కోడూరు నియోజకవర్గ ఇంచార్జ్,కూడ చైర్మన్ శ్రీ ముక్కా రూపానందరెడ్డి గారి నివాసం ముక్కవారిపల్లెలో ఆదివారం మహానాడు కార్యక్రమం సన్నాహక సమావేశం ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశానికి టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ శ్రీ దామలచర్ల సత్య , రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.జోనల్ కోఆర్డినేటర్గా ఎన్నికైన అనంతరం తొలిసారిగా విచ్చేసిన శ్రీ దామలచర్ల సత్య గారిని శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు,శ్రీ ముక్కా రూపానందరెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి శాలువ కప్పి ఘనంగా సత్కరించారు.అనంతరం శ్రీ దామలచర్ల సత్య మరియు శ్రీ రూపానందరెడ్డి గారు కలిసి పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారిని శాలువ కప్పి సత్కరించి అభినందనలు తెలిపారు.తదుపరి జరిగిన సమావేశంలో 27,28 తేదీలలో నిర్వహించనున్న మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చేపట్టాల్సిన ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు,క్లస్టర్ ఇంచార్జులు,ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ…
“మహానాడు అనేది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ స్ఫూర్తిని గుర్తు చేసే మహోత్సవం.ప్రతి కార్యకర్త ఎన్టీఆర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి” అని పేర్కొన్నారు.“ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధి,ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు.ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా దూసుకుపోతోంది” అని కొనియాడారు.“టీడీపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ నారా లోకేష్ గారు యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపుతూ భవిష్యత్ రాజకీయాలకు నూతన దిశను చూపిస్తున్నారు” అని అభినందించారు.“ప్రతి కార్యకర్త సమిష్టిగా కృషి చేసి మహానాడును చారిత్రాత్మక విజయంగా నిలపాలని” పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు…

