
రాజమహేంద్రవరం :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ సభ్యునిగా జీ వెంకట రమణ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలో 25 మంది సభ్యులు ఉండగా, వారు పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి రెండు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారని ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో పేర్కొంది.ఈ సందర్భంగా జీవీ రమణ మాట్లాడుతూ నాటక అకాడమీ సభ్యుడిగా తనపై నమ్మకంతో ఎంపిక చేసిన రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, అలాగే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడికి, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే నాటక రంగానికి తన వంతు పూర్తి సహకారం అందించి నాటకరంగ బలోపేతానికి కృషి చేయగలనని, నాటకరంగ అధ్యక్షునిగా ఉన్న గుమ్మడి గోపాలకృష్ణకి తన వంతు పూర్తి సహకారం అందజేస్తానని ,త్వరలో పదవీ ప్రమాణ స్వీకారం జరుగుతుందని తెలియజేశారు…



