
రాజోలు :- క్రైస్తవ సంఘాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ,అలాగే 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డినెన్స్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల18న నిర్వహించనున్న భారీ శాంతి ర్యాలీ మరియు బహిరంగ సభకు సంబంధించిన కరపత్రాలను శుక్రవారం ఉదయం తాటిపాక మఠం సమీపంలోని బెరాకా ప్రేయర్ చర్చిలో దళిత నాయకులు,దైవ సేవకులు విడుదల చేశారు.
డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు,పి.గన్నవరం నియోజకవర్గాల పరిధిలోని సఖినేటిపల్లి,మల్కిపురం,రాజోలు,పి.గన్నవరం,మామిడికుదురు మండలాల క్రైస్తవ జేఏసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.మే 18న నిర్వహించే శాంతి ర్యాలీ అనంతరం మల్కిపురంలోని ఏ ఎఫ్ డి టి కాలేజ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ జరగనుందని నిర్వాహకులు వెల్లడించారు.ఈ కార్యక్రమానికి క్రైస్తవ సంఘాలు,దళిత సంఘాలు,క్రైస్తవ అభిమానులు,ప్రజాస్వామ్యవాదులు పెద్ద సంఖ్యలో హాజరై తమ నిరసనను తెలియజేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సరేళ్ళ విజయ్ ప్రసాద్,పోలుమూరి శ్యాం,తెన్నేటి కిషోర్,గెడ్డం సింహ,దేవ రాజేంద్ర ప్రసాద్,మట్ట సురేష్,బూసి జాన్ మోషే,బొంతు మనిరాజు,దేవ ప్రవీణ్,ఇంజేటి రవి,బళ్ళ నోబుల్ ప్రవీణ్,గంటా షారోన్,తాడి సుధా కిషోర్ తదితరులు పాల్గొన్నారు…



