ప్రశాంతంగా ఏపి ఈఏపిసెట్ 2026 ప్రారంభం…

కాకినాడ :- కాకినాడ లో ఏపీఈఏపీ సెట్ 2026 ఆన్లైన్ ప్రవేశ పరీక్ష మొదటి రోజు మే 12 వ తేదీ మంగళవారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం లోని హైదరాబాద్లో ప్రశాంతంగా ప్రారంభమైనట్లు ఏపి ఈఏపిసెట్ ఛైర్మన్, ఉపకులపతి ప్రొ.సి.ఎస్. ఆర్.కే.ప్రసాద్ తెలిపారు. మంగళవారం ఉదయం ఉపకులపతి ప్రొ.సిఎస్ఆర్ కే ప్రసాద్ యూనివర్శిటీ అధికారులు, ఏపి ఈఏపిసెట్ కన్వీనర్ ప్రొ. ఎన్.మోహన్ రావు కో-కన్వీనర్లు, మెంబర్లతో కలిసి సెట్ కోడ్ను విడుదల చేసి పరీక్ష నిర్వహణా తీరును పరిశీలించారు. మొదటి రోజు మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ను తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లో ప్రారంభమైన ఏపి ఈఏపి సెట్ పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు ఈఏపి సెట్ ఛైర్మన్, ఉపకులపతి ప్రొ. సి.ఎస్ ఆర్. కే . ప్రసాద్ తెలిపారు. ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి మొదటి రోజు మంగళవారం ఉదయం 28,529 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 26,678 మంది పరీక్షకు హాజరయ్యారని, 1851 మంది గైర్హాజరైనట్లు కన్వీనర్ ప్రొ.ఎన్.మోహన్ రావు తెలిపారు.మొత్తం 93.51శాతం మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారన్నారు. అలాగే మంగళవారం మధ్యాహ్నం 29,835 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 27,934 మంది పరీక్షకు హాజరయ్యారని, 1901మంది గైర్హాజరు కాగా మొత్తం 93.62శాతం మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారన్నారు. మొత్తంగా 58,364మంది పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 54,612మంది పరీక్షకు హాజరయ్యారని, 3752 మంది గైర్హాజరు కాగా 93.57శాతం మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. అలాగే కాకినాడ జిల్లాలో ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి మొదటి రోజు మంగళవారం ఉదయం 468 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 452మంది పరీక్షకు హాజరయ్యారని, 16మంది గైర్హాజరైనట్లు కన్వీనర్ ప్రొ.ఎన్.మోహన్ రావు చెప్పారు . మొత్తం 96.58 శాతం మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారన్నారు. అలాగే మంగళవారం మధ్యాహ్నం 469 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 440 మంది పరీక్షకు హాజరయ్యారని, 29 మంది గైర్హాజరు కాగా మొత్తం 93.81 శాతం మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారన్నారు. మొత్తంగా 937మంది పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 892మంది పరీక్షకు హాజరయ్యారని, 45 మంది గైర్హాజరు కాగా 95.19 శాతం మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు కన్వీనర్ ప్రొ.ఎన్.మోహన్ రావు తెలియజేశారు.

Kancharla Media
Author: Kancharla Media

Leave a Comment