
విశాఖ ఎంవిపి కాలని :- కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ గెజిట్(రాజ పత్రం)తో రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియ పూర్తయిందని,ఇది రాష్ట్ర రాష్ట్రం మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఒక కీలక ముందడుగని విశాఖ పార్లమెంట్ టిడిపి అధ్యక్షుడు చోడే వెంకట పట్టాభిరాం హర్షం వ్యక్తం చేశారు.ఇటీవల కేంద్రం రైల్వే జోన్ ఏర్పాటుకు అధికారిక గెజిట్ విడుదల చేసిన సందర్భంగా నగరంలోని రైల్వే స్టేషన్ ముందు పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి.దీనిలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ విశాఖ రైల్వే జోన్ ఏర్పాటువల్ల రైల్వే లలో రాష్ట్రం మంచి అభివృద్ధి సాధిస్తుం దన్నారు.రాష్ట్ర ప్రభుత్వ విప్ గణబాబు మాట్లాడుతూ జోన్ ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఎన్డీఏ ప్రభుత్వ చిత్తశుద్ధి వెల్లడైందన్నారు.రైల్వే జోన్ కోసం అహర్నిశలు కృషి చేసిన విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు మతుకుమిల్లి శ్రీభరత్ గారికి ధన్యవాదాలు తెలుపు తున్నా మన్నారు. విశాఖ రైల్వే స్టేషన్ ప్రధాన ద్వారం ముందు ఆయన చిత్రపటాలతో వున్న ప్లకార్డులను ప్రదర్శించారు.టిడిపి కార్యకర్తలు బాణాసంచా పేల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
కేక్ కట్ చేసి అందరికీ పంచి పెట్టారు.విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ టిడిపి అధ్యక్షుడు చోడే పట్టాభిరామ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను అభినందించారు.నాయకులు మాట్లాడుతూ 40 ఏళ్ల నాటి కల నేటితో సాకారమైం దన్నారు.దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుం దన్నారు.యువతకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు పెరుగుతా యన్నారు.ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరేందుకు తీవ్రంగా కృషి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,మంత్రి నారా లోకేష్,విశాఖ ఎంపీ శ్రీభరత్ లకు కృతఙ్ఞతలు తెలుపుతున్నా మన్నారు.రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మరియు ప్రధాని నరేంద్ర మోదీని పలుమార్లు కలిసి జోన్ అవసరాన్ని వివరించి ఒప్పించారని చెప్పారు.రైల్వే జోన్ సాధన సమితి కన్వీనర్ చలసాని గాంధీ మాట్లాడుతూ, “రైల్వే జోన్ సాధన కోసం సంవత్సరాల పాటు జరిగిన పోరాటానికి ఫలితం లభించిందన్నారు.విభజన హామీల్లో ఒకటైన ఈ డిమాండ్ నెరవేరడం రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో విశాఖ దక్షిణ నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి సీతం రాజు సుధాకర్,ప్రధాన కార్యదర్శి లోడగల కృష్ణ,విల్లూరు భాస్కరరావు,బైరెడ్డి పోతన రెడ్డి,ఉమ్మి అప్పారావు,ఈతలపాక సుజాత,కోట నరేష్,బుచ్చా రామిరెడ్డి,కింగ్,కేదార్ లక్ష్మి,బొడ్డేటి మోహన్,గొప్ప ధర్మారావు,కుట్ట కార్తిక్ బత్తిన నవీన్,నెక్కెళ్ళ సత్తిబాబు,గొర్లె నాగమణి,వరలక్ష్మి తోట శ్రీదేవి,ఉసిరికాయ విల్లేశ్వరి,రవిశంకర్, సౌజన్య,జయశ్రీ,టిడిపి అనుబంధ సంఘాల నాయకులు,మహిళలు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



