విశాఖ ప్రీమియర్ లీగ్ ముగింపు …

గాజువాక :- యువత చదువు తో పాటు క్రీడల్లో కూడా రానించాలని బీజేపీ రాష్ట్ర మీడియా పెనలిస్ట్,గాజువాక బీజేపీ ఇంచార్జి కర్ణంరెడ్డి నర్సింగరావు, వైసీపీ ఇంచార్జి తిప్పల దేవన్ రెడ్డి,73 వార్డ్ మాజీ కోర్పిరేటర్ భూపతిరాజు శ్రీనివాస్, సుజాత అన్నారు.ఈ మేరకు జీవీఎంసీ 73వ ఆదర్శనగర్ లో గత మూడు రోజులు గా నిర్వహిస్తున్న విశాఖ ప్రీమియర్ లీగ్ నేటితో ముగిసింది. విశాఖ ప్రీమియర్ లీగ్ ఆర్గనైజర్ సంజయ్ వర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమనికి ముఖ్య అధితులు గా బీజేపీ రాష్ట్ర మీడియా పెనలిస్ట్ గాజువాక బీజేపీ ఇంచార్జి కర్ణంరెడ్డి నర్సింగరావు, వైసీపీ ఇంచార్జి తిప్పల దేవన్ రెడ్డి,యువ నాయకులు పల్లా కార్తీక్, 73 వార్డ్ మాజీ కార్పొరేటర్ భూపతిరాజు శ్రీనివాసరాజు,సుజాత విచ్చేసి ముందుగా నర్సింగరావు జన్మదిన సందర్బంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిష్టాత్మకైనా విశాఖ ప్రీమియర్ లీగ్ ఆదర్శ గ్రౌండ్ లో నిర్వహించడం క్రీడాకారులకు ఎంతగానో ఆహ్లాదాన్ని ఇస్తుందని అన్నారు. ఈ ఆదర్శ గ్రౌండ్ ను క్రీడాకారులకు ఎంతగానో ఉపయోగపడేలాగా అద్భుతమైన స్టేడియం లాగా రూపు దిద్దుకుంటుందని అన్నారు.గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా క్రీడాకారులు ఫ్రెండ్లీ వాతావరణంలో ప్రీమియర్ లీగ్ కొనసాగించాలని తెలిపారు.విశాఖ ప్రీమియర్ లీగ్ లో పది జట్లు పాల్గొన్నాయని మొదటి స్థానం లో గోవింద్ సి సి టీమ్,రెండవ స్థానం లో పోలమాంబ లేవేన్,మూడవ స్థానం లో భాస్కర్ లేవేన్ జట్లు విజయం సాధించాయి అన్నారు.
ఈ కార్యక్రమంలో మనోజ్,ప్రసాంత్ ,ప్రకాష్,గంగాధర్ తదితర స్థానిక నాయకులు,క్రీడాకారులు,యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Kancharla Media
Author: Kancharla Media

Leave a Comment