ప్రొద్దుటూరులో టీడీపీ అంతర్గత విభేదాలు ముదురుతున్నాయా?…

ఎస్‌ఎస్ మాల్ వివాదంతో ఉక్కు ప్రవీణ్ – ఎమ్మెల్యే వరద వర్గాల మధ్య ఉద్రిక్తత…

కడప/ప్రొద్దుటూరు :- ప్రొద్దుటూరులో ఎస్‌ఎస్ మాల్ వివాదం రాజకీయంగా వేడెక్కింది.అధికార పార్టీకి చెందిన నేతల మధ్య విభేదాలు బహిరంగరంగానికి రావడంతో పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉక్కు ప్రవీణ్ రెడ్డి మరియు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి వర్గీయుల మధ్య తీవ్ర వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి.ఎస్‌ఎస్ మాల్‌కు సంబంధించి అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఉక్కు ప్రవీణ్ రెడ్డి గత వారం జిల్లా కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఫిర్యాదు ఆధారంగా జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులు మాల్ వద్దకు వెళ్లి పరిశీలనలు చేపట్టినట్లు సమాచారం. ఇదే సమయంలో ఎస్‌ఎస్ మాల్‌లో కొండారెడ్డికి వాటాలు ఉన్నాయని, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కోట్లు తీసుకుని అనుమతులు ఇప్పించారని ప్రవీణ్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.ఈ వ్యవహారం ఉద్రిక్తతలకు దారితీయడంతో ఎస్‌ఎస్ మాల్ వద్ద లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పోలీసులు భావించారు. దీంతో ఎస్పీ ఆదేశాల మేరకు ప్రవీణ్ రెడ్డిని అక్కడి నుంచి ఆయన నివాసానికి తరలించినట్లు తెలుస్తోంది. అనంతరం ప్రవీణ్ రెడ్డి ఇంటిపై కొందరు దాడికి పాల్పడిన ఘటన సంచలనంగా మారింది.ఈ దాడిపై స్పందించిన ప్రవీణ్ రెడ్డి, “రాచమల్లు – కొండారెడ్డి కలిసి నాపై రాజకీయ పోరాటం చేయాలనుకుంటున్నారు. గత ఐదేళ్లుగా రాచమల్లు వద్ద ఉన్న వారే నా ఇంటిపై దాడికి వచ్చారు” అంటూ ఆరోపించారు.ఈ విషయాన్ని పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తానని ఆయన వెల్లడించారు.ప్రస్తుతం ప్రొద్దుటూరులో ఈ వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారగా,పార్టీ అంతర్గత విభేదాలు మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Kancharla Media
Author: Kancharla Media

Leave a Comment