ప్రాణాలు పోతున్న విద్యుత్ శాఖ వారు పట్టించుకోరా?…

కారంపూడి ( పల్నాడు జిల్లా) :- మండల కేంద్రమైన కారంపూడిలో విద్యుత్ హై టెన్షన్ లైన్ పాత 66 కే.వి ప్రస్తుతం 33 కెవి లైనుగా వాడుతున్న హై టెన్షన్ లైను ప్రస్తుతం కారంపూడి పట్టణంలోని మాచర్ల రోడ్ లో గల ఎస్సీ కాలనీలో ఇండ్ల మధ్యలో ఉండి,గతంలో 66 కే.వి లైన్ గా వేసిన లైన్ కు ఒక్కొక్క తీగకు ఆరు డిస్కులు వేసి అప్పట్లో లైన్ లాగడం జరిగింది.కాలక్రమేనా విద్యుత్ శాఖలో అభివృద్ధి పనులు కొనసాగుతూ ఎక్కడికక్కడ 132 కెవి సబ్ స్టేషన్ లు స్థాపించటంతో 66 కేవీ స్థానే 33 కెవి సామర్థ్యం గా ఈ లైన్ ను మార్చటంతో ఆరు డిస్కిల్స్ లో మూడు డిస్కస్ తొలగించి,ప్రస్తుతం ఈ లైను 33 కేవీ లైన్ గా కొనసాగిస్తున్నారు.గతంలో విజయవాడ గుణదల నుండి మాచర్ల వరకు ఈ లైన్ ను వేయటం జరిగిందని,అప్పట్లో ఈ లైన్ మధ్యలోనే అవసరమైన చోట 66/11 కేవీ ట్రాన్స్ఫార్మర్స్ ను ఏర్పాటు చేసి అప్పట్లో కరెంటు ఇచ్చేవారు.కానీ మారుతున్న కాలానుగుణంగా 66 పోయి 33 కెవి లైన్ గా మారిన తర్వాత దీనిని పిడుగురాళ్ల నుండి మాచర్ల వరకు ఉపయోగించుకునేవారు.ఇప్పుడు కారంపూడి లో కూడా 132/ 33 కెవి సబ్ స్టేషన్ ఏర్పాటు చేయటంతో కారంపూడిలో పిడుగురాళ్ల నుండి వచ్చే 33 కెవి లైన్ ను అత్యవసర లైన్ గా ఉపయోగించుకునే నిమిత్తం కారంపూడి 33/11 కె.వి సబ్ స్టేషన్ లో స్టాండ్ బై గా ఉంచారు.అయితే ఈ లైను కారంపూడి గ్రామంలో ఇళ్ళ మీదగాను ,ఇళ్ల మధ్యలోనూ అతి తక్కువ ఎత్తులో ఉండటం వలన, క్రాసారాలు వెడల్పుగా ఉండి డిస్కిల్స్ తో క్రిందకు వేలాడుతూ ఉంటం వలన, ఈ లైన్ వెళ్తున్న ప్రాంతమంతా కూడా నూతనంగా కట్టుకునే ఇళ్లకు ఇబ్బందికరంగాను,అపాయకరంగానూ ఉండటం వలన,అనేకసార్లు అనేకమంది దీని షాక్ కి గురై చావు బతుకుల మధ్య కొట్టుకుని ప్రాణాలతో బయటపడ్డారు. హై టెన్షన్ లైన్స్ గ్రామాలలో ,పట్టణాలలో ఇండ్లపైగా వెళుతున్న వాటిని తొలగించి వాటిని ఆల్టర్నేటివ్గా లైన్లు వేసి ప్రమాదాలను అరికట్టాలని అప్పటి చైర్మన్ 2008లో ఆదేశాలు ఇచ్చిన, కారంపూడి మండలంలో మాత్రం పనిచేసిన అధికారులు ఇవేమీ పట్టించుకోకుండా మాకెందుకని తప్పించుకోవడంతో ఇక్కడ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి అని కాలనీవాసులు కారంపూడి పట్టణవాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ మధ్యకాలంలోనే ఇద్దరికీ ఈ హై టెన్షన్ లైన్ వల్ల ఒళ్ళు కాలగా ఒకరు అవిటితనంతో బయటపడగా, ఇంకొకరు హాస్పిటల్ లో పోరాటం చేసి మరణించడం జరిగిందని, ఎంతమందికి ప్రమాదాలు జరిగిన, ఎంతమంది చనిపోయిన గతంలో కారంపూడి లో విధులను నిర్వహించిన విద్యుత్ అధికారులు మాకెందుకులే అని పట్టించుకోకపోవడంతో ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయని కాలనీవాసులు వాపోతున్నారు. ఇప్పటివరకు అంచనా వ్యయం ఎక్కువ అవుతుందని కూడా కొంతమంది అధికారులు దీనిపై శ్రద్ధ చూపించకుండా ఉండటాన్ని కూడా కారణం ఇదే. అయితే ఇప్పుడు పిడుగురాళ్ల 33 కెవి లైన్ నుండి గాదెవారి పల్లి 33/ 11 కెవి సబ్ స్టేషన్ కు దాచేపల్లి రోడ్డు లో ట్యాప్ చేసినందున ఇప్పుడు అంచనా వ్యయం కూడా ఎక్కువగా ఉండదు. కారంపూడి 33/ 11 కెవి సబ్ స్టేషన్ నుండి దాచేపల్లి రోడ్డు లోని 33/ 11 కెవి గాదవారిపల్లి లైను వద్దకు షుమారుగా 20 నుండి 25 స్తంభాలు వేస్తే 33 కెవి పిడుగురాళ్ల లైను కారంపూడి సబ్ స్టేషన్ లోకి వచ్చి స్టాండ్ బై సప్లై గా ఉంటుంది. ఇలా చేసినందువలన దాచేపల్లి రోడ్ వద్ద నుండి కారంపూడి 33/ 11 కెవి సబ్ స్టేషన్ వద్దకు వచ్చే 33 కెవి పిడుగురాళ్ల లైను ఐడిల్ అవుతుంది కాబట్టి ఇళ్ల మధ్యలో నుండి ఎస్సీ కాలనీలో నుండి వచ్చే ప్రమాద భరితంగా ఉన్న ఈ లైన్ ను తొలగించవచ్చు. కాబట్టి ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించి మా కాలనీలో ప్రమాద భరితంగా, ప్రాణాంతకంగా ఉన్న ఈ 33 కెవి పిడుగురాళ్ల లైన్ ను వెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా కారంపూడి పట్టణ ప్రజలు ,ఎస్సీ కాలనీవాసులు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను,సి పి డి సి ఎల్ చైర్మన్ ని కోరుతున్నారు.ఇలా ఈ లైన్ తీసేయడం వలన మా ఎస్సీ కాలనీ వాసుల ప్రాణాలను కాపాడిన వారవుతారని,ఉన్నతాధికారులు స్పందించి ఈ లైన్ ను తొలగించవలసిందిగా కోరుతున్నారు.

Kancharla Media
Author: Kancharla Media

Leave a Comment