విద్యుత్ షాక్ కు గురై యువకుడు మృతి…

గంట్యాడ :- గంట్యాడ మండలం నీలావతి గ్రామానికి చెందిన కాట చినబాబు అనే యువకుడు విద్యుత్ షాక్ కు గురై మృతి చెందాడు. మృతుని తండ్రి వీరాస్వామి ఆదివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు గంట్యాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకుడు చినబాబు బీ.టెక్ . చదువుకుని,ఉద్యోగం కోసం కాకినాడలో కోచింగ్ పూర్తిచేసి మే 22వ తేదీన స్వగ్రామమైన నీలావతికి వచ్చాడు.శనివారం రాత్రి భోజనం చేసిన తర్వాత చిన్నబాబు తన ఇంటి ప్రక్కన ఉన్న కాట గున్నమ్మ వారి ఇంటిలో నిద్రపోవడానికి వెళ్లి అక్కడ ఉన్న టేబుల్ ఫ్యాన్ ప్లగ్ వైరును కరెంటు స్విచ్ బోర్డుకు పెడుతున్న సమయంలో కరెంట్ షాక్ కొట్టి తగిలిపడిపోయి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే అతని తల్లిదండ్రులు విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్లి జాయిన్ చేయగా డాక్టర్ పరీక్షించి చినబాబు చనిపోయినట్లు నిర్ధారించారు. మృతుని తండ్రి వీరాస్వామి ఇచ్చిన రిపోర్టుపై గంట్యాడ పోలీస్ స్టేషన్ ఏ.ఎస్ఐ.రమణ కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Kancharla Media
Author: Kancharla Media

Leave a Comment