యధావిధిగా నేడు పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు…జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్…

కాకినాడ :- మే నెల 25వ తేదీ సోమవారం కాకినాడ జిల్లాలో పీజీఆర్ఏ, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు యధావిధిగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వివిధ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ కార్యక్రమం జిల్లా స్థాయిలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కాకినాడ కలెక్టరేట్ గ్రివెన్స్ హాలులోను,రెవెన్యూ అంశాలపై రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం వివేకానంద హాలు లోను నిర్వహించడం జరుగుతుందని, జిల్లాస్థాయి అధికారులు అందరూ విధిగా ఈ కార్యక్రమాల కు హాజరు కావాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.అర్జీదారులు దాఖలు చేసిన తమ అర్జీలు ఇంకా పరిష్కారం కాకపోయినా లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసు కోవడానికి 1100 నంబర్‌కు కాల్ చేసి సంప్రదించవచ్చని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ సమస్యలకు పరిష్కారం పొందవచ్చన్నారు. అర్జీదారులు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవడానికి Meekosam. ap.gov.ఇన్.వెబ్సైట్ నందు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవచ్చును. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతో పాటు డివిజన్, మండల, మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహిస్తారన్నారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి తమ ఫిర్యాదులను సమీపం లోని డివిజన్, మండల కార్యాలయాలు లేదా మున్సిపల్ కార్యాలయాల లో కూడా సమర్పించ వచ్చని జిల్లా కలెక్టర్ తెలిపారు

Kancharla Media
Author: Kancharla Media

Leave a Comment