
అండర్-11 విభాగంలో డబుల్ విక్టరీ సాధించిన అన్షు శ్రేయన్…
నల్లగొండ :- నల్లగొండ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మిర్యాలగూడలోని క్లియో స్పోర్ట్స్ అకాడమీలో నిర్వహించిన జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు ఉత్సాహభరితంగా జరిగాయి. ఈ పోటీల్లో అండర్-11 కేటగిరిలో నల్లగొండకు చెందిన బాలుడు క్రీడాకారుడు బొంగు అన్షు శ్రేయన్ అద్భుత ప్రతిభ కనబరిచి సింగిల్స్ మరియు డబుల్స్ విభాగాల్లో విజేతగా నిలిచి డబుల్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.తన చురుకైన ఆటతీరు, వేగవంతమైన షాట్లు, అద్భుత సమన్వయంతో ప్రత్యర్థులను మట్టికరిపించిన అన్షు శ్రేయన్ అందరి ప్రశంసలు అందుకున్నాడు. చిన్న వయసులోనే జిల్లా స్థాయిలో రెండు విభాగాల్లో విజేతగా నిలవడం విశేషంగా మారింది.నల్లగొండ పట్టణంలోని పెద్దబండ ప్రాంతానికి చెందిన కైరాలి ప్రైవేట్ పాఠశాలలో విద్యాభ్యాసం కొనసాగిస్తున్నాడు.చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తూ ముందుకు సాగుతున్న అతడిపై తల్లిదండ్రులు, కోచ్‌లు, పాఠశాల ఉపాధ్యాయులు గర్వం వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా పలువురు క్రీడాభిమానులు, స్థానిక ప్రముఖులు,స్నేహితులు అన్షు శ్రేయన్‌కు అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో రాష్ట్ర,జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు..



