
గుర్రంకొండ :- అన్నమయ్య జిల్లా,గుర్రంకొండ మండలం,చెర్లోపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రెడ్డమ్మ దేవత దేవస్థాన ఆలయ అభివృద్ధి పనులకు గాను వైస్సార్ కడప జిల్లా,బుగ్గలపల్లి కు చెందినట్టి భక్తులు బి.రెడ్డయ్య,రూ.50,116/లు ,విరాళంగా అందించారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం దాతలచే అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించి,ఆశీర్వాదము అందజేశారు.ఈ మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు వాయల్పాడు ఆలయ ఖాతా కు జమ చేయ బడునని,ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్న దాతలకు ఆలయ చైర్మన్ లంకి పల్లి రాజన్న నాయుడు,ఈవో మంజుల ధన్యవాదాలు తెలియజేశారు.


