
గండేపల్లి :- గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య యూనివర్సిటీ లో పది రోజుల నుండి జరిగిన సిక్స్ నావల్ ఎన్ సీసీ వార్షిక శిక్షణ శిబిరం విజయవంతంగా ముగిసాయి.ఈ క్యాంపులో 12 పాఠశాలలు 6 కళాశాలల నుండి సుమారు 550 మంది ఎన్సిసి క్యాడేట్లు 30 మంది నావల్ సిబ్బంది ద్వారా శిక్షణ తీసుకున్నారు.ఈ శిక్షణలో భాగంగా సైబర్ నేరాలు,డ్రోన్,ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తో ప్రకృతి విపత్తులు నుండి రక్షణ వంటి వాటిపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేసారు.డ్రిల్,ఫైరింగ్,క్రమశిక్షణ,దేశ రక్షణ కోసం ప్రత్యేక శిక్షణ,డిఫెన్స్ లో చేరేందుకు ప్రోత్సహించడానికి,అవగాహన కల్పించడానికి వార్ షిప్ మరియు ఎయిర్ క్రాఫ్ట్ లను సందర్శించడం వంటి వాటిని క్యాడేట్స్ కి కల్పించి,సాయుధ దళాలు పై అవగాహన కల్పించారు…



