
కాకినాడ :- స్థానిక బోటు క్లబ్ ఉద్యానవనంలో వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో హ్యాపీ సండే (ఆనందాదివారం ) పురస్కరించుకుని జరిగిన మ్యాజిక్ షో ప్రేక్షకులను అలరించింది. మ్యాజిక్ షో నిర్వహించిన బిఎస్వీ రమణమూర్తి మాట్లాడుతూ మ్యాజిక్ అనేది ఒక ప్రదర్శన కళ అని భ్రమల ద్వారా ప్రేక్షకులకు వినోదాన్ని అందించడమని అన్నారు. సృజనాత్మకతను పెంపొందించడానికి, మౌలిక ఆలోచన విధానాన్ని ప్రేరేపించడానికి మ్యాజిక్ షో దోహదపడుతుందని అన్నారు.అనంతరం సినీ సంగీత విభావరి జరిగింది.గాయకులు వి.ప్రభాకర్ రావు,జి.శివకుమార్ ప్రభృతులు పాడిన పాటలు ప్రేక్షకులను అలరించాయి. ఈ కార్యక్రమంలో వాకర్స్ సంఘ అధ్యక్షులు అడబాల రత్న ప్రసాద్ ,కార్యదర్శి డాక్టర్ దాసరి శ్రీధర్,ప్రసాద్ నాయుడు,సూర్యనారాయణ,చింతపల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.



