ఇంటి తాళాలు పగులగొట్టి ఆరు తులాల బంగారు నగలు చోరీ..కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పట్టణ పోలీసులు…

నర్సీపట్నం రూరల్ :- : ఇంటి తాళాలు పగలగొట్టి ఆరు తులాల బంగారు నగలు చోరీ చేసిన ఘటన నర్సీపట్నంలో చోటుచేసుకుంది.పట్టణ సీఐ షేక్ గఫూర్ అందించిన వివరాల ప్రకారం శుక్రవారం రాత్రి సమయంలో,నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివపురంలో నివాసం ఉంటున్న మద్దికొండ సిరిల్ పాల్ ఇంటికి తాళాలు వేసి విజయవాడకు వెళ్లిన సమయంలో,గుర్తుతెలియని దొంగలు ఇంటి మెయిన్ డోర్ లాక్ మరియు ఐరన్ గ్రిల్స్ డోర్ లాక్ పగులగొట్టి, బెడ్‌రూమ్‌లోని ఐరన్ బీరువాలో ఉంచిన సుమారు 6 తులాలకు పైగా బంగారు ఆభరణాలను చోరీ చేశారని తెలిపారు.ఈ విషయమై బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.అన్ని కోణాలలో విచారణ నిర్వహిస్తూ, సీసీ కెమెరా ఫుటేజీలు,మరియు సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను త్వరలో గుర్తించి పట్టుకుంటామన్నారు.ఎవరైనా ఇతర ఊర్లకు వెళ్లే సమయంలో తమ విలువైన బంగారు ఆభరణాలు మరియు ఇతర విలువైన వస్తువులను బ్యాంక్ లాకర్‌లో భద్రపరచడం గానీ లేదా తమ వెంట తీసుకెళ్లడం గానీ చేయాలని, పట్టణ ప్రజలను కోరారు.అలాగే,ఇంటికి తాళం వేసి బయట ప్రాంతాలకు వెళ్తున్నట్లయితే పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందిస్తే, ఎల్ హెచ్ ఎం ఎస్ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని,అదనంగా,నైట్ బీట్ సిబ్బందిని కూడా ఆయా ఇళ్ల పరిసరాల్లో పర్యవేక్షణ నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.ప్రస్తుతం వేసవి సెలవుల కారణంగా ప్రజల ప్రయాణాలు అధికంగా జరుగుతున్న నేపథ్యంలో,ఇళ్ల దొంగతనాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పట్టణ సీఐ గఫూర్ కోరారు…

Kancharla Media
Author: Kancharla Media

Leave a Comment