సాగునీటి రంగాన్ని ఇప్పుడిప్పుడే గాడిలో పెడుతున్నాము… ఎమ్మెల్యే కే ఎస్ ఎన్ రాజు

రావికమతం :- గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన సాగునీటి రంగాన్ని ఇప్పుడిప్పుడే గాడిలో పెడుతున్నామని ఎమ్మెల్యే కె ఎస్ ఎన్ రాజు తెలిపారు. జల ధార- జల హారతి ,నీటిపారుదల శాఖ ఆపరేషన్ అండ్ మెయింటెన్స్ నిధుల నుంచి మండలానికి మంజూరైన వివిధ సాగునీటి వనరుల నిర్మాణ పనులకు ఆదివారం ఆయన భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం ఐదేళ్లపాటు సాగినట్టు రంగాన్ని పట్టించుకోలేదన్నారు.దీంతో సాగునీటి కాలువలు చెరువులు, రిజర్వాయర్లు నీటి సామర్థ్యం తగ్గిపోయిందన్నారు.ఫలితంగా వ్యవసాయరంగం చతికల పడిందని ఆవేదన వ్యక్తం చేశారు .తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాగునీటి వనరుల పూడికతీత,కాలువలకు సిమెంట్ లైనింగ్, చెక్ డాములు నిర్మాణం తదితర పనులు వేగవంతం చేయాలని నిర్ణయించిందన్నారు దీనిలో భాగంగా రావికమతం మండలంలో కొత్తకోట ముంతమామిడి కట్టు, మేడివాడ పెద్ద చెరువు, గర్నికం కోమటి చెరువు ,రావికమతం పెద్దిరాజు చెరువు,గుమ్మలపాడు అప్పలరాజు చెరువు, కెబిపి అగ్రహారం గొర్ల చెరువు, కళ్యాణపు రిజర్వాయర్ కాలువలు పూడిక తీత, పనులకు నిధులుమంజూరయ్యాయని చెప్పారు .వంద రోజుల్లో ఈ పనులు పూర్తి చేసి ఖరీఫ్ సీజన్ ప్రారంభం నాటికి సాగు బొమ్మలకు సమృద్ధిగా నీరు అందించాలని లక్ష్యంగా తీసుకున్నమన్నారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షుడు కోమటి శంకర్రావు, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ రాజన కొండనాయుడు మాజీ ఎంపీటీసీ బంటు శ్రీనివాసరావు,తదితరులు పాల్గొన్నారు…

 

Kancharla Media
Author: Kancharla Media

Leave a Comment