
గంట్యాడ :- జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ ఆదేశాల మేరకు ఆదివారం రాత్రి గంట్యాడ గ్రామంలో గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారిపై రహదారి భద్రతలో భాగంగా వాహనదారులకు గంట్యాడ ఎస్ ఐ డి.సాయికృష్ణ పలు విషయాలపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని ఈ సందర్భంగా గంట్యాడ ఎస్ ఐ సాయి కృష్ణ సూచించారు.అదేవిధంగా మద్యం తాగి వాహనం నడపరాదని, మద్యం సేవించి వాహనం నడిపే వారికి జైలు శిక్షతోపాటు అపరాధ రుసుము విధించడం జరుగుతుందన్నారు. వాహనదారులు రహదారి భద్రతా సూత్రాలు తప్పనిసరిగా పాటించాలన్నారు.పరిమిత వేగంతో మాత్రమే ప్రయాణించాలని, వాహనాల నడుపుతూ సెల్ ఫోన్ లో మాట్లాడడం ప్రమాదకరమని గంట్యాడ ఎస్ఐ సాయి కృష్ణ తెలియజేశారు. కార్యక్రమంలో గంట్యాడ పోలీస్ స్టేషన్ సిబ్బంది, వాహనదారులు పాల్గొన్నారు…



