
నెల్లిమర్ల :- అత్యవసర పరిస్థితిలో ఉన్న ఓ గర్భిణి ప్రాణాలు కాపాడేందుకు జరజాపుపేటకు చెందిన సాధన యువజన సంఘం సభ్యులు శనివారం రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.గైనిక్ సమస్యతో మిమ్స్ ఆసుపత్రిలో చేరిన కె.వర్షిణి అనే మహిళకు అత్యవసరంగా రక్తం కావాల్సి రావడంతో, ఆమె కుటుంబ సభ్యులు సాధన యువజన సంఘం అధ్యక్షుడు పోలుబోతు దుర్గాప్రసాదరావును సంప్రదించారుదుర్గాప్రసాదరావు పిలుపుతో సంఘం సభ్యులు కనకల సురేంద్ర,రవికాంత్,మీసేవ శ్రీను వెంటనే స్పందించి..జిల్లా కేంద్రంలోని ఎన్వీఎన్ మరియు మిమ్స్ బ్లడ్ బ్యాంక్‌లలో రక్తదానం చేశారు. బాధితురాలికి మొత్తం 8 యూనిట్ల రక్తం అవసరం కాగా,ఈ సంఘం తరఫున 2 యూనిట్ల రక్తాన్ని ఉచితంగా ఏర్పాటు చేసి పేషెంట్ కేర్టేకర్లకు అందించారు.సంఘం అధ్యక్షుడు పోలుబోతు దుర్గాప్రసాదరావు నిన్నటితో 69వ సారి రక్తదానం చేయడం విశేషం. అలాగే సెలవుపై వచ్చిన జవాన్ కనకల సురేంద్ర, గ్రామ పురోహితులు రవికాంత్,మీసేవ శ్రీను కూడా ఇప్పటివరకు ఎన్నోసార్లు అత్యవసర సమయాల్లో లైవ్ డొనేషన్లు చేశారు.రక్తదాతల సేవలను అభినందిస్తూ సంఘం ఉపాధ్యక్ష, కార్యదర్శులు బెల్లన వెంకటరావు, పసుమర్తి వెంకటరమణ, సభ్యులు కల్యాణ్, అశోక్ తదితరులు కొనియాడారు.విపత్కర సమయంలో స్పందించిన సాధన యువజన సంఘం తీరుపై రోగి బంధువులు,బ్లడ్ బ్యాంక్ సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు…



