
తుని :- కాకినాడ జిల్లా,తుని నియోజకవర్గ ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం చూపేందుకు జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ నేరుగా మీ ముందుకు వస్తున్నారు. మే నెల 15వ తేదీ శుక్రవారం తుని మండల పరిషత్ కార్యాలయం వేదికగా నిర్వహించనున్న ‘మీ కోసం’ కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సాగే ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారి స్వయంగా అందుబాటులో ఉంటారని ఎంపీడీవో మరిడయ్య వెల్లడించారు.వివిధ ప్రభుత్వ పథకాలు, వ్యక్తిగత సమస్యలు లేదా సామాజిక ఫిర్యాదులు ఏవైనా సరే, ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకుని నేరుగా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని అధికారులు కోరుతున్నారు.మీ సమస్య ఏదైనా, పరిష్కారం దిశగా అడుగులు వేయడానికి ఈ శుక్రవారం తుని ఎంపీడీవో కార్యాలయానికి తరలిరావాలని విజ్ఞప్తి చేస్తున్నారు…



