

గండేపల్లి :- గండేపల్లి మండలం కే. నాయికంపల్లి గ్రామానికి చెందిన యువకుడు సేవా లోకేష్ (16) సంవత్సరముల, విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు.గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కళాశాలలో నూతన బిల్డింగ్ నిర్మాణం సెంట్రింగ్ చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి మరణించినాడు.యువకుడు పదో తరగతి చదువుతుండగా సెలవులు కావడంతో స్నేహితులతో కలిసి పనికి వచ్చాడు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు.గండేపల్లి ఎస్సై శివ నాగబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు…



