
కాకినాడ :- ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు భూపతి రాజు ఈశ్వర్ రాజు వర్మ (సాయిబాబా రాజు),జిల్లా కేంద్ర గ్రంథాలయం లో వేసవి విజ్ఞాన శిక్షణ శిబిరానికి ( సమ్మర్ క్యాంపు ) కు వచ్చి పిల్లలను ఏ విధంగా తీర్చిదిద్దు తున్నారని పరిశీలించారు. ఈ సందర్భంగా శిబిరంలో పాల్గొంటున్న విద్యార్థిని, విద్యార్థులతో మాట్లాడి అక్కడ నిర్వహిస్తున్న వివిధ విద్యా, సృజనాత్మక కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటూ కొత్త విషయాలను నేర్చుకుంటున్న తీరు గమనించిన చైర్మన్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ శిబిరం లో బోధిస్తున్న ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందిస్తూ, వారు విద్యార్థులకు అర్థమయ్యే విధంగా శిక్షణ అందిస్తున్నారని ప్రశంసించారు. అలాగే విద్యార్థులు అందరూ ఆసక్తితో ప్రతి కార్యక్రమంలో పాల్గొని, వేసవి సెలవులను సద్వినియోగం చేసుకొని కొత్త జ్ఞానం సంపాదించాలని సూచించారు. విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ఆర్ .వి రమణమూర్తి మ్యాజిక్ షో ద్వారా విద్యార్థులందరినీ మంత్రముగ్ధుల్ని చేసి అలరించడం జరిగినది.
తదుపరి జే ఎన్ టి యు కె అసిస్టెంట్ డైరెక్టర్. సిహెచ్ సుధా దేవి ప్రతిరోజు నిర్వహిస్తున్న యోగా శిక్షణ తరగతులలో భాగంగా విద్యార్థులచే ముఖ్య అతిధుల సమక్షంలో యోగాసనాలు వేయించడం జరిగినది. డి ఆర్ డి ఎ శిక్షణా నిపుణులు ఎం . సత్య బాల విద్యార్థినీ, విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్ పై శిక్షణా.టీ .సునీత,పేపర్ క్రాఫ్ట ఒరిగామి పై శిక్షణా నిర్వహించడం నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి (ఎఫ్ .ఏ .సి ) పాలంకి నాగరాజు, ఉప గ్రంథాలయ అధికారి ఇంచార్జి కే .కిషోర్, సీనియర్ అసిస్టెంట్ ఎం .శ్రావ్య, గ్రంథాలయ సిబ్బంది,
ఏ వి ఎస్ నాగేంద్ర కుమార్,టీ వీర్రాజు,ఎన్ వి ఎస్ ఫణీంద్ర ఎన్ కుమార్. జి .దుర్గా ప్రసాద్,వి.అరుణ, కార్యాలయ సిబ్బంది ఎస్.రాజు, టీ.సాయి వెంకటరావు స్థానిక పాఠశాలల 96, మంది విద్యార్థిని ,విద్యార్థులు పాల్గొన్నారు…



