సామర్లకోటలో హనుమాన్ శోభాయాత్ర; ముఖ్యఅతిథిగా రాదా మనోహర్ దాస్…

సామర్లకోట :- పెద్దాపురం నియోజకవర్గంలో హనుమాన్ శోభాయాత్ర, బైక్ ర్యాలీ మంగళవారం అత్యంత వైభవంగా జరిగింది. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాధా మనోహర్ దాస్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. హిందూ యూత్, బిజెపి, విశ్వ హిందూ పరిషత్, ఆధ్యాత్మికవేత్తలు, యువకులు బైక్ ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.సామర్లకోట పురవీధుల వెంట భారీ ర్యాలీ సాగింది. పెద్దాపురం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. లోక కళ్యాణార్థం హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీ నిర్వహించినట్లు బిక్కిన సాయి తెలిపారు. హిందువుగా జీవిస్తాం, హిందూమత పరిరక్షణకు కృషి చేస్తాం, అంటూ వేలాదిగా వచ్చిన ప్రజలు యువతతో రాధా మనోహర్ దాస్ ప్రతిజ్ఞ చేయించారు.పెద్దాపురం డిఎస్పి తిలక్, సామర్లకోట సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణ భగవాన్, పెద్దాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ వై ఆర్ కే శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు కల్పించారు. భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు, రాష్ట్ర మహిళా నేత కరెడ్ల దేవి, రైతు సమాఖ్య రాష్ట్ర నేత కంటే జగదీష్ మోహన్ తదితరులు పాల్గొన్నారు…

Kancharla Media
Author: Kancharla Media

Leave a Comment