
అనకాపల్లి జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. బుచ్చయ్యపేట పోలీసులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో భారీగా గంజాయిని తరలిస్తున్న ముఠాను పట్టుకున్న వివరాలను జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మీడియా సమావేశంలో వెల్లడించారు.
తేదీ 11.మే మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో, ఈగిల్ టీమ్, స్పెషల్ బ్రాంచ్ బుచ్చయ్యపేట పోలీసులు బంగారుమెట్ట – అనకాపల్లి రోడ్డులోని గొన్నవానిపాలెం జంక్షన్ వద్ద వాహనాల తనిఖీ నిర్వహించారు. ఆ సమయంలో అనకాపల్లి వైపు వేగంగా వస్తున్న ఒక స్కూటీ, మారుతి సియాజ్ కారును అడ్డగించి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు . వారి నుండి 97 లక్షల విలువ చేసే 194 కేజీల గంజాయిని మారుతి సుజుకి కారుని స్కూటీ మూడు మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు. విచారణలో నిందితులు: గుమ్మాల పేరునాయుడు, బైలపూడి గ్రామం, చీడికాడ మండలం. వ్యక్తి గతంలో 6 కేసులు ఉన్నాయి అని చెప్పారు. రెండవ నిందితుడు మండిపల్లి సత్తిబాబు (సాగుదారు), గజ్జేడు గ్రామం, పెదబయలు మండలం, అల్లూరి సీతారాం జిల్లా జిల్లా.మూడవ నిందితుడు గొల్లవెల్లి గణేష్ (డ్రైవర్), బైలపూడి గ్రామం, చీడికాడ మండలం.కు చెందిన వాడు అన్నారు.

అనకాపల్లి జిల్లా పోలీసులు గంజాయి డ్రగ్స్ పట్ల ‘జీరో టాలరెన్స్’ పాలసీని అనుసరిస్తున్నారని ఎస్పీ స్పష్టం చేశారు. మీ ప్రాంతంలో ఎవరైనా గంజాయి వినియోగిస్తున్నా లేదా విక్రయిస్తున్నా వెంటనే 112 లేదా 1972 టోల్ ఫ్రీ నంబర్లకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు అత్యంత రహస్యంగా ఉంచబడతాయని హామీ ఇచ్చారు. ఈ ఆపరేషన్‌లో ప్రతిభ కనబరిచిన అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ ఎం.శ్రావణి, కొత్తకోట సిఐ జి.కోటేశ్వరరావు, కొత్తకోట ఎస్సై ఎం.శ్రీనివాస్, బుచ్చయ్యపేట ఎస్సై ఏ.శ్రీనివాసరావు వారి సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి, ప్రశంసా పత్రాలు నగదు రిర్డులను అందజేశారు.



