
గోకవరం :- తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మల దొడ్డి వద్ద నేషనల్ హైవే 516 రోడ్ పై శనివారం రాత్రి టిప్పర్ లారీ అగ్నికి ఆహుతి అయింది.స్థానికులు కథనం ప్రకారం పోలవరం జిల్లా రంపచోడవరం మండలం నరసాపురం గ్రామంలో నారాయణ స్టోన్ క్రషర్ నుండి మెటల్ లోడుతో పి గన్నవరం వెళుతున్న టిప్పర్ లారీ మార్గమధ్యలో గోకవరం మండలం గుమ్మళ్ళదొడ్డి వద్ద కు వచ్చేసరికి లారీ వెనుక టైర్లలో మంటలు చెలరేగాయి. విషయం గమనించిన డ్రైవర్ లారీని వెంటనే నిలిపివేశాడన్నారు.స్థానికులు మంటలు ఆర్పి ప్రయత్నం చేసినప్పటికీ లారీ టైర్లు పూర్తిగా దగ్ధమయి అన్నారు.ఎటకేలకు ఫైర్ ఇంజన్ రావడంతో టిప్పర్ లారీ పూర్తిగా దగ్ధం అవ్వకుండా మంటలు అదుపు చేశారన్నారు.టిప్పర్ లారీ అగ్నికి ఆహుతి కావడంతో నేషనల్ హైవే పూర్తిగా ట్రాఫిక్ స్తంభించిందన్నారు.గోకవరం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ను అదుపు చేశారు…



