పెచ్చులూడుతున్న భవనం..పైపై మెరుగులు,మరమ్మతులు చేయకుండానే రంగులు పూత…

మున్సిపల్ అధికారుల తీరుపై ప్రజల ఆగ్రహం…

పిఠాపురం :- పట్టణంలోని మున్సిపల్ అధికారుల పనితీరు ఇప్పుడు విమర్శలకు కేంద్రబిందువుగా మారింది.స్థానిక రాజా రామ్మోహన్ రాయ్ పార్కును ఆనుకుని ఉన్న శానిటరీ ఇన్‌స్పెక్టర్ కార్యాలయ భవనం దారుణంగా దెబ్బతిన్నప్పటికీ,దానికి మరమ్మతులు చేయకుండానే రంగులు వేయడంపై పట్టణ ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు.ప్రమాదకరంగా మారిన భవనం:ఈ భవనం చాలా చోట్ల పెచ్చులూడిపోయి, అద్వానంగాn బయటకు కనిపిస్తూ ఎప్పుడూ ఏం జరుగుతుందో అన్నట్లుగా ప్రమాదకర స్థితిలో ఉంది.కనీసం ప్యాచింగ్ లేదా స్లాబ్ మరమ్మతులు చేయాల్సిన అధికారులు,అవేమీ పట్టించుకోకుండా కేవలం నామమాత్రంగా పైపై మెరుగులు దిద్దుతూ పెయింటింగ్ వేయడం గమనార్హం.

ప్రజాధనం వృథా కాదా?…
“లోపల పునాది బలహీనంగా ఉన్నప్పుడు పైన రంగులు వేస్తే ఏం లాభం?” అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.భవనం గట్టిదనంపై దృష్టి పెట్టకుండా,కేవలం చూపులకు బాగుండాలని రంగులు వేయడం ప్రజాధనాన్ని వృథా చేయడమేనని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి,భవనాన్ని పూర్తిగా పునరుద్ధరించిన తర్వాతే రంగులు వేయించాలని పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు.

Kancharla Media
Author: Kancharla Media

Leave a Comment