
పి.గన్నవరం :- పి గన్నవరం నియోజకవర్గంలో 2.93 కోట్లతో కాలువలు,డ్రైయినేజి పూడికతీత అభివృద్ధి పనులును పి.గన్నవరం లో కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన శాసన సభ్యులు గిడ్డి సత్యనారాయణ గోదావరి సెంట్రల్ డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ గుబ్బల శ్రీనివాస్, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన కాలువలు మరియు డ్రైయి నే జి జీల పునరుద్ధరణ అత్యంత అవసరమని తెలిపారు.రైతాంగానికి సమర్థవంతంగా సాగునీరు అందించాలంటే కాలువలను శుభ్రపరచడం,గట్లను బలపరచడం,పిచ్చి మొక్కలు మరియు చెట్లను తొలగించడం అత్యవసరమని పేర్కొన్నారు.

గతంలో విశాలంగా ఉన్న కాలువలు పడవ రవాణాకు కూడా ఉపయోగపడేవని,ప్రస్తుతం పూడిక,చెట్లు మరియు పిచ్చి మొక్కల కారణంగా నీటి ప్రవాహం తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.కాలువలను పూర్తిగా శుభ్రపరచి చివరి ఆయకట్టు రైతులకు కూడా సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.అలాగే డ్రైయి నేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్ల చివరి ప్రాంతాల్లో ముంపు సమస్యలు ఏర్పడుతున్నాయని,డ్రైన్స్ మరియు అవుట్‌ఫ్లో స్లూయిస్‌లను పునరుద్ధరించి గోదావరిలోకి నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమం లో ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు, ఇరిగేషన్ DEE రవీంద్రబాబు,నగరం మార్కెట్ యార్డ్ చైర్మన్ పెనుమా ల లక్ష్మి,రాష్ట్ర ఇరిగేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ సిరిగినీడి వెంకటేశ్వరరావు,అయినవెల్లి డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ కాకర శ్రీనివాస్, రాజోలు నీటి సంఘం డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షులు ఆకన బాబ్జి నాయుడు, గన్నవరం వైస్ DC చొల్లంగి సత్యనారాయణమూర్తి, ఆత్మ కమిటీ చైర్మన్ ఆరుమెల్లి సాయిబాబు,అవిడి నీటి సంఘం వైస్ DC శివ,ఇసుకపూడి నీటి సంఘం అధ్యక్షులు కొలనాటి సత్యనారాయణ రాజు,తాటికాయల శ్రీనివాస్,మద్దాల రంగా, ఆది బాబు,కడలి మోహన్,కడలి కుమార్,షేర్ శ్రీనివాస్,రవి రఘు,ఇరిగేషన్ AEE రమేష్,ఇరిగేషన్ అధికారులు,కూటమి నాయకులు పాల్గొన్నారు…



