పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలో రెడ్ క్రాస్ దినోత్సవం…

విజయనగరం :- స్థానిక పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలో శుక్రవారం సాయంత్రం రెడ్ క్రాస్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కేఆర్డి ప్రసాద్ రావు మాట్లాడుతూ రెడ్ క్రాస్ 1863లో హెన్రీ డునాంట్ ప్రారంభించారని తెలిపారు.1859లో ఇటలీ,ఫ్రాన్స్ – ఆస్ట్రియా మధ్య జరిగిన సల్ఫారినో యుద్ధంలో గాయపడిన వారికి చికిత్స చేసేందుకు రెడ్ క్రాస్ అనే స్వచ్ఛంద సంస్థను ఆయన స్థాపించారని,తరువాత ఇది అంతర్జాతీయ రెడ్ క్రాస్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ – ప్రపంచవ్యాప్తంగా నేషనల్ రెడ్ క్రాస్ ఆర్గనైజేషన్ గా సేవలను అందిస్తోందని అన్నారు.మే 8న హెన్రీ డ్యూనాంట్ పుట్టినరోజు పురస్కరించుకొని ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవంగా ప్రతీ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారని తెలిపారు.మానవతా విలువలను పెంపొందించడం,ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు కృషి చేయడం,రక్తం అవసరమైన రోగులకు రక్తాన్ని అందించడం,ప్రకృతి వైపరీత్యాల సమయంలో మానవతా సహాయం అందించడం,ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం రెడ్ క్రాస్ నిర్వహిస్తోందన్నారు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పట్టణ నిరాశ్రయుల వసతి గృహం కూడా ఎంతోమంది దాతల వల్ల నడుస్తుందని,వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.అనంతరం దాతలైన పువ్వాడ ఆంజనేయులు, పువ్వాడ భాస్కరరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ సాగర్ బాబుకు, శ్రీ అమ్మ సేవా సంఘం సభ్యులు లక్కీ భాస్కర్,అబ్బాస్ కు,ఎస్వీఎన్ హోటల్ శ్యామ్ కు ప్రశంసాపత్రాలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఇండియన్ సొసైటీ బ్లడ్ బ్యాంకు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి,మేనేజింగ్ కమిటీ మెంబర్ కంది వెంకటరమణ,నిరాశ్రయుల వస్తు గృహం మేనేజర్ త్యాడ రామకృష్ణారావు(బాలు) తదితరులు పాల్గొన్నారు.

Kancharla Media
Author: Kancharla Media

Leave a Comment