జెడ్పీ నిధులతో అన్ని అంగన్వాడి కేంద్రాలకు మంచినీటి బోర్లు…

జెడ్పిటిసి సభ్యులు దొండా రాంబాబు…

బుచ్చియ్యపేట :- మండలంలోని అన్ని అంగన్వాడి కేంద్రాల్లో జెడ్పీ నిధులతో త్రాగునీటి సదుపాయానికి ప్రత్యేక చర్యలు చేపట్టామని రాష్ట్ర వైకాపా సంయుక్త కార్యదర్శి,స్థానిక జెడ్పిటిసి సభ్యులు దొండా రాంబాబు గురువారం తెలిపారు.మండలంలోని కొండపాలెం అంగనవాడి కేంద్రానికి త్రాగునీటి బోరు, మోటారు ఏర్పాటుకు రూ.1.30 లక్షల జెడ్పీ నిధులతో మంజూరయ్యాయని రాంబాబు చెప్పారు.మాజీ మంత్రి చోడవరం వైసీపీ ఇన్చార్జి గుడివాడ అమర్నాథ్,జెడ్పీ చైర్మన్ జల్లపల్లి సుభద్ర ఆదేశాల మేరకు కొండపాలెం అంగన్వాడీ కేంద్రం వద్ద త్రాగునీటి బోరు నిర్మాణానికి జెడ్పిటిసి దొండా రాంబాబు గురువారం స్థానిక వైసిపి నాయకులతో కలిసి టెంకాయ కొట్టి రిగ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి దొండా రాంబాబు మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో జెడ్పీ నిధులతో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. కొండపాలెం అంగనవాడి కేంద్రంతో పాటు పొట్టిదొర్లపాలెం,కందిపూడి అంగనవాడి కేంద్రాలకు రూ.1.30 లక్షలు చొప్పున రూ. 3.90 లక్షల నిధులు మంజూరైనట్లు తెలిపారు.త్వరలో పోట్టిదోరపాలెం,కందిపూడి అంగనవాడి కేంద్రాలకు కూడా త్రాగునీటి బోరు,మోటారు ఏర్పాటు చేయునున్నమన్నారు.ఈ సందర్బంగా అంగన్వాడీ కేంద్రంలో త్రాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేసిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్,జెడ్పీ చైర్మన్ జల్లపల్లి సుభద్ర,జెడ్పిటిసి దొండా రాంబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు రాజునాయుడు,మండల పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ రెహ్మాన్,గ్రామ పార్టీ అధ్యక్షులు ముచ్చకర్ల శ్రీనివాసరావు,సర్పంచులు గోపిశెట్టి శ్రీనివాసరావు,కోవెల ఈశ్వరరావు,పెద్దాడ నాయుడు,స్థానిక నాయకులు,అంగన్వాడీ కార్యకర్త నూరిబి,మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు…

Kancharla Media
Author: Kancharla Media

Leave a Comment