బద్వేలులో సమస్యల పరిష్కార వేదిక కు విశేష స్పందన…

బద్వేలు :- బద్వేల్ లోని రాఘవేంద్ర ఫంక్షన్ హాల్ లో భూ సమస్యలు, వివిధ రకాల సమస్యలపై ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఒక నియోజకవర్గం,ఒక నెల,నాలుగు పర్యటనలు కార్యక్రమం తొలిసారిగా నిర్వహించడం జరిగింది.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువగా పరిపాలనను అందించాలనే లక్ష్యంతో చేపట్టిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఒక నియోజకవర్గం,ఒక నెల, నాలుగు పర్యటనలు” కార్యక్రమం తొలిసారిగా శుక్రవారం బద్వేల్ నియోజకవర్గంలో నిర్వహించబడింది.కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఆధ్వర్యంలో బద్వేల్ పట్టణంలోని శ్రీ రాఘవేంద్ర గ్రాండ్ నందు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించి, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నిధి మీనా , బద్వేల్ డివిజన్ ఆర్డీవో ఏ. చంద్రమోహన్ , డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి , మైదుకూరు డిఎస్పి రాజేంద్రప్రసాద్, వివిధ శాఖల జిల్లా స్థాయి, డివిజనల్ స్థాయి మరియు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించగా, మొత్తం 226 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రాలను కలెక్టర్ కి మరియు సంబంధిత శాఖల అధికారులకు సమర్పించారు.అందిన ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి, నిర్దేశిత గడువులో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమం బద్వేల్ డివిజన్ ఆర్డీవో ఏ. చంద్రమోహన్ అధ్యక్షతన విజయవంతంగా నిర్వహించబడింది. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తుందని అధికారులు తెలిపారు.

Kancharla Media
Author: Kancharla Media

Leave a Comment