
గండేపల్లి :- వెన్నుపోటుకు రెండేళ్లు అనే కార్యక్రమం పై గండేపల్లి లో వైసిపి నాయకులు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ముందుగా వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా మండల వైసీపీ అధ్యక్షుడు మద్ది పట్ల రామక్రిష్ణ మాట్లాడుతూ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన బూటకపు ప్రభుత్వం ప్రజలకు మొండి చెయ్య చూపిందిఅన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన వైసీపీ నాయకులు ,కార్యకర్తలు ఆందోళనకు దిగి నినాదాలు చేస్తూ జాతీయ రహదారి వెంబడి ధర్నా నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ గ్యారంటీల మేనిఫెస్టో ప్రతులను తగులబెట్టారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ కలగళ్ల దొరబాబు,జిల్లా వైసీపీ ఉపాధ్యక్షుడు రామకుర్తి శ్రీ రామచంద్రమూర్తి, కే గోపాలపురం మాజీ సర్పంచ్ పార్థసారథి,మధు కుమార్,వబ్బిని వీరబాబు,బొర్రంపాలెం మాజీ సర్పంచ్ సుబ్రహ్మణ్యం మరియు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.



